న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ట్రాన్స్‌ఫర్ జోన్‌పై లివర్‌పూల్ ఆశలు: జుర్గెన్

గాయాల భారీన ఫిలిప్పె కౌటిన్హో, డానియల్ స్టర్రిడ్జ్, రాబర్టో ఫిర్మినో, డాన్నీ ఇంగ్స్ తప్పుకోవడంతోపాటు ఆఫ్రికన్ నేషనల్ కప్ టోర్నీ కోసం సాడియో మానే పయనంతో లివర్ పూల్ అటాకింగ్ సామర్థ్యం తగ్గుముఖం పట్టనున్

By Nageshwara Rao

లివర్‌పూల్: వచ్చేనెలలో తమ జట్టులోకి ఇతర జట్ల నుంచి బదిలీ మార్కెట్ నుంచి అదనపు ప్లేయర్లను తీసుకొనేందుకు సిద్ధమైందని లివర్ పూల్ మేనేజర్ జుర్గెన్ క్లొప్ప్ వ్యాఖ్యానించాడు. అయితే అది అత్యవసరమా? కాదా? అన్న విషయం తెలియదన్నాడు. లివర్ పూల్ టీం కుర్రాళ్లు ఫిలిప్పె కౌటిన్హో, డానియల్ స్టర్రిడ్జ్, రాబర్టో ఫిర్మినో, డానీ ఇంగ్స్ తీవ్ర గాయాలతో టీంకు అందుబాటులో ఉండరు.

ఇక వచ్చేనెలలో ప్రారంభమయ్యే ఆఫ్రికన్ దేశాల కప్ టోర్నీలో పాల్గొనేందుకు సాడియో మానె బయలుదేరి వెళ్లడంతో ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఇపిఎల్) టోర్నీలో అటాకింగ్ చేసే సామర్థ్యంగల ప్లేయర్లు తక్కువన్నాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎఫ్ సి రొస్టోవ్ స్ట్రయికర్ సర్దార్ అజ్మౌన్ ను జట్టులోకి తీసుకునేందుకు లివర్ పూల్ క్లబ్ యాజమాన్యం ఆసక్తిగా ఉంది.

కానీ క్లోప్ప్ మాత్రం తనకు అందుబాటులో ఉన్న స్క్వాడ్ పట్ల హ్యాపీగా ఉన్నానన్నాడు. జట్టు యాజమాన్యంతో అనునిత్యం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపాడు. ఈ దఫా ఆటగాళ్లలో అత్యధికులు గాయపడ్డారని, అందువల్లే తాము ఎక్కువగా ఆలోచించాల్సి వస్తుందన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందుబాటు ఉన్న జట్టుతో ఎలా ఆడాలన్న విషయమై వ్యూహ రచనచేస్తున్నట్లు చెప్పారు.

ఫిలిప్పె, రాబర్టో, డానియల్, ఆడం లాల్లనా తదితర ఆటగాళ్లు జట్టుకు అందుబాటులో లేకపోవడం ఒకింత క్లిష్టతరంగానే ఉన్నదన్నాడు. ఇటువంటి పరిస్థితి ప్రతి జట్టుకూ ఇబ్బందికరంగానే ఉంటుందన్నాడు. తాను 20 రకాల ఆప్షన్లతో ముందుకు వెళ్లబోనని, సరైన ఆప్షన్లను మాత్రమే ఎంచుకుని ముందుకు సాగుతానన్నాడు.

ఇదే ప్రతిభతో మ్యాచ్ ఆడే సామర్థ్యం గల ఐదుగురు ప్లేయర్లు ఉన్నా గేమ్స్ ఆడలేకపోవచ్చు, కానీ యువ ప్లేయర్ అందుబాటులో ఉంటే మెరుగైన ఫలితాలు వస్తాయన్నాడు. ప్లేయర్లంతా ఫిట్ గా ఉంటే తమకు మరొకరి అవసరం రాదన్నాడు. తమకు అఫెన్సివ్ ఆప్షన్లతో దూసుకెళ్లే కుర్రాళ్లు కావాలన్నాడు.

యువకులైతే ప్రతిరోజూ దూసుకెళ్లి సానుకూల పరిస్థితుల్లో మ్యాచ్ ను తమకు అనువుగా మార్చుకునే సామర్థ్యం ఉంటుందన్నాడు. ప్రస్తుతం తమ కుర్రాళ్లను అమర్యాదరకంగా టీజ్ చేస్తున్నారని క్లొప్ప్ నిరాశ వ్యక్తంచేశారు. అయితే వచ్చే ఏడాది జనవరి 31 వరకు తామేమీ మాట్లాడదలుచుకోలేదన్నారు. ఇతర ప్లేయర్లను జట్టులోకి కొనుగోలుచేసే అవకాశముందన్నాడు.

Liverpool prepared for January transfer window: Jurgen Klopp

జనవరిలో జరిగే ట్రాన్స్ ఫర్ల మార్కెట్ క్రేజీనెస్ నింపుతుందన్నారు. 'అది తమను గందరగోళపరుస్తుంది. ప్రతి ఆటగాడు విమర్శలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. మేం ఏదో ఒకటి సాధించేందుకు మ్యాచ్ లో ప్రతి ఒక్కరు సిద్ధం కావాల్సుంది' అని చెప్పాడు. తాము సరైన మార్గమే ఎంచుకుంటామే తప్ప ఇతర పరిస్కార మార్గాలేమీ వద్దన్నాడు.

ఇపిఎల్ 15వ వారం షెడ్యూల్
శనివారం నుంచి ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఇపిఎల్) టోర్నీ 15వ వారం ప్రారంభమవుతుంది. ఐదోస్థానంలో ఉన్న టొట్టెన్హం హాట్సుపుర్, మాంఛెస్టర్ యునైటెడ్ జట్ల మధ్య మ్యాచ్ కీలకం కానున్నది. ప్రస్తుత సీజన్‌లో మాంఛెస్టర్ యునైటెడ్ టీం అంచనాలకు అనుగుణంగా ఆడలేకపోతున్నది. రెడ్ డేవిల్స్ జట్టు 14 మ్యాచ్‌లకు కేవలం ఐదు మ్యాచ్‌లలో విజయం సాధిస్తే, ఆరింటిలో డ్రా చేసుకున్నది.

టొట్టెన్హం జట్టు కంటే ఐదు పాయింట్లు తక్కువతో వెనుకబడి ఉంది. ఈ దఫా డీసెంట్ ఆటతో ముందుకు సాగుతూ టైటిల్ కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నది. లీగ్ లీడర్స్‌గా పేరొందిన చెల్సియా.. వెస్ట్ బ్రూంవిచ్ అల్బియన్, స్టోక్ సిటీపై అర్సెనల్, మాంఛెస్టర్ సిటీతో డిఫెండింగ్ చాంపియన్లు లైసెస్టర్ సిటీ తలపడనున్నాయి.

15వ వారం షెడ్యూల్ ఇది
శనివారం: వాట్ఫోర్డ్ వర్సెస్ ఎవర్టొన్ (డిసెంబర్ 10, సాయంత్రం ఆరుగంటలకు)
స్వాన్ సీ వర్సెస్ సుందర్ లాండ్ (డిసెంబర్ 10, సాయంత్రం 8.30 గంటలకు)
బర్న్ లీ వర్సెస్ బౌర్నెమౌథ్ (డిసెంబర్ 10, సాయంత్రం 8.30 గంటలకు)
అర్సెనల్ వర్సెస్ స్టోక్ సిటీ (డిసెంబర్ 10, సాయంత్రం 8.30 గంటలకు)
హుల్ సిటీ వర్సెస్ క్రిస్టల్ ప్యాలెస్ (డిసెంబర్ 10, సాయంత్రం 8.30గంటలకు)
లైసెస్టర్ సిటీ వర్సెస్ మాంఛెస్టర్ సిటీ (డిసెంబర్ 10, సాయంత్రం 8.30 గంటలకు)
చెల్సియా వర్సెస్ వెస్ట్ బ్రూమ్ (డిసెంబర్ 11, సాయంత్రం 5.30గంటలకు)
సౌతాంప్టన్ వర్సెస్ మిడిల్స్ బౌగ్ (డిసెంబర్ 11, సాయంత్రం 7.45గంటలకు)
మాంఛెస్టర్ యునైటెడ్ వర్సెస్ టొట్టెన్హమ్ హాట్స్ పూర్ (డిసెంబర్ 11, సాయంత్రం 7.45గంటలకు)
లివర్ పూల్ వర్సెస్ వెస్ట్ హమ్ యునైటెడ్ (డిసెంబర్ 11, సాయంత్రం 10గంటలకు)

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X