మూల్యం చెల్లించక తప్పదా?: లివర్‌పూల్‌పై క్రమశిక్షణ చర్యలు తప్పవ్.. యుఈఎఫ్ఏ హెచ్చరిక

Posted By:
Liverpool face UEFA charges for damaging Manchester City bus

హైదరాబాద్: మాంఛెస్టర్ సిటీ ఆటగాళ్లు వెళుతున్న బస్సుపై దాడి చేసినందుకు లివర్ పూల్ జట్టుపై క్రమశిక్షణ చర్యలు తప్పవని యూరోపియన్ యూనియన్ ఫుట్ బాల్ అసోసియేషన్ (యూఈఎఫ్ఎ) పేర్కొంది. మాంఛెస్టర్ సిటీ టీం బస్సుపై లివర్ పూల్ జట్టు అభిమానుల దాడిని యూరోపియన్ యూనియన్ ఫుట్ బాల్ అసోసియేషన్ (యూఈఎఫ్ఎ) తీవ్రంగా పరిగణించింది. ఈ దాడి విషయమై లివర్ పూల్ జట్టుపై క్రమశిక్షణా చర్యలపై దృష్టి సారించింది.

బుధవారం చాంపియన్స్ లీగ్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో లివర్ పూల్ జట్టుపై మాంఛెస్టర్ సిటీ జట్టు విజయం సాధించడంతో లివర్ పూల్ అభిమానులు కోపంతో రెచ్చిపోయి మాంచెస్టర్ సిటీ ఆటగాళ్లను తీసుకెళ్లే బస్సుపై దాడి చేసిన సంగతి తెలిసిందే. అభిమానుల వ్యవహారశైలి, తీరు, ప్రవర్తనకు సంబంధించి నాలుగు నిబంధనలను ఉల్లంఘించారని యెఫా పేర్కొంది.

వచ్చేనెల 31న క్రమశిక్షణా కమిటీ ముందు హాజరు కావాల్సిందే:

వచ్చేనెల 31న క్రమశిక్షణా కమిటీ ముందు హాజరు కావాల్సిందే:

బస్సుకు జరిగిన నష్టం, అక్కడ జరిగిన వివాదంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ, లివర్ పూల్ జట్టు కారణమైందని ఒక ప్రకటనలో పేర్కొన్నది. అనుకోని ఘటనకు అసలు కారణం.. బాణా సంచాల పేలుళ్లేనని, వాటికి తగ్గట్టుగా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది. యూఈఎఫ్ఏ ఆధ్వర్యంలోని నియంత్రణ, నైతిక విలువలు, క్రమశిక్షణ కమిటీ వచ్చేనెల 31వ తేదీన ఇరు పక్షాల వాదనలను వినేందుకు సిద్ధంగా ఉంది.

ధ్వంసమైన బస్సు మార్చేసిన నిర్వాహకులు:

ధ్వంసమైన బస్సు మార్చేసిన నిర్వాహకులు:

మాంఛెస్టర్ సిటీ కోచ్ లక్ష్యంగా లివర్ పూల్ జట్టు అభిమానులు పలువురు స్టేడియంలోకి దూసుకొచ్చారు. స్టేడియం కిటికీల నుంచి మాంఛెస్టర్ సిటీ కోచ్ లక్ష్యంగా చేసుకుని బాటిళ్లు, ఫ్లేర్స్ విసిరేశారు. మాంఛెస్టర్ సిటీ కుర్రాళ్లను వారి విడిది వద్ద దింపి వచ్చిన బస్సును మార్చేశారు.

బస్సుపై దాడి పట్ల మాంఛెస్టర్ సిటీ మేనేజర్ పెప్ గార్డియోలా ఆగ్రహం

బస్సుపై దాడి పట్ల మాంఛెస్టర్ సిటీ మేనేజర్ పెప్ గార్డియోలా ఆగ్రహం

దీనిపై లివర్ పూల్ యాజమాన్యం, మేనేజర్ జుర్గెన్ క్లోప్ స్పందించారు. మాంఛెస్టర్ సిటీ జట్టుకు క్షమాపణ చెప్పారు. కానీ మాంఛెస్టర్ సిటీ మేనేజర్ పెప్ గౌర్డైలా ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను కొత్తవాడినన్న మాంఛెస్టర్ సిటీ మేనేజర్ గౌర్డెలా

తాను కొత్తవాడినన్న మాంఛెస్టర్ సిటీ మేనేజర్ గౌర్డెలా

లివర్ పూల్ జట్టు అభిమానుల నుంచి ముందే హెచ్చరికలు వచ్చిన సమస్య నుంచి తప్పించడంలో పోలీసులు విఫలం అయ్యారని పేర్కొన్నారు. ‘రెండు రోజుల క్రితం మా జట్టుపై దాడి జరుగుతుందని మీకు వివరించాను. అనుకున్నట్లే జరిగింది. ఇక్కడి పరిస్థితులు తెలుసుకోవడానికి నేను కొత్తవాడ్ని' అని గౌర్డెలా పేర్కొన్నారు.

ఏడాది క్రితం డార్ట్ మండ్ పైనా కొంత దాడి జరిగిందని వ్యాఖ్య

ఏడాది క్రితం డార్ట్ మండ్ పైనా కొంత దాడి జరిగిందని వ్యాఖ్య

‘సాధారణంగా ఏదైనా జరుగుతుందంటే ముందుగానే పోలీసులకు తెలుస్తుంది. వారు అటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు చేపట్టొచ్చు. లివర్ పూల్ జట్టు నుంచి మాపై దాడి జరుగుతుందని నేను ఊహించలేదు' అని తెలిపాడు. ఏడాది క్రితం డార్ట్ మండ్ జట్టు పట్ల ఏదో జరిగిందని, తాము ఫుట్ బాల్ ఆడేందుకు ఇక్కడకు వచ్చామని, ఇటువంటి పరిస్థితులు ఉంటాయని తెలియదన్నారు.

లివర్‌పూల్ ఫ్యాన్స్ ఇలా చేస్తారని ఊహించలేదని వెల్లడి

లివర్‌పూల్ ఫ్యాన్స్ ఇలా చేస్తారని ఊహించలేదని వెల్లడి

‘బస్సు పూర్తిగా ధ్వంసమైంది. లివర్‌పూల్ వంటి ప్రతిష్ఠాత్మక క్లబ్ ఫ్యాన్ ఇటువంటి చర్యలకు దిగుతారని నేను అసలు ఊహించలేదు. లివర్ పూల్ జట్టు ఈ చర్యకు దిగలేదు. ఈ పని చేసింది ప్రజలు అభిమానులు. ఇకముందు మళ్లీ ఇటువంటివి జరుగొద్దని ఆశిద్దాం' అని గౌర్డెలా తెలిపారు.

Story first published: Friday, April 6, 2018, 12:40 [IST]
Other articles published on Apr 6, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి