న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

Fifa World Cup 2022: మారడోనా రికార్డు సమం చేసిన మెస్సీ.. తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో అర్జెంటీనా విక్టరీ

Lionel Messi equals Diego Maradona record as Argentina defeats Mexico

ఫిఫా వరల్డ్ కప్‌లో తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో అర్జెంటీనా అద్భుత విజయం సాధించింది. మెక్సికోతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ ఆ జట్టుకు తొలి గోల్ అందించాడు. ఈ క్రమంలో వరల్డ్ కప్‌లలో 8 గోల్స్ సాధించిన అర్జెంటీనా ప్లేయర్‌గా ఫుట్‌బాల్ లెజెండ్ డీగో మారడోనా రికార్డును సమం చేశాడీ మోడర్న్ లెజెండ్. దీంతో అర్జెంటీనా అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.

ఖతర్ వేదికగా జరుగుతున్న ఈ వరల్డ్ కప్‌లో తాము ఆడిన తొలి మ్యాచ్‌లో అర్జెంటీనా అనూహ్యంగా ఓడింది. సౌదీ అరేబియా చేతిలో ఈ జట్టు ఓడిపోవడం అందరికీ షాకిచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మెక్సికోతో మ్యాచ్‌కు సిద్దమైందీ మెస్సీ టీం. ఆ ఓటమి తాలూకు ఛాయలు ఇంకా అర్జెంటీనా ఆటగాళ్ల మొఖాలపై కనిపిస్తూనే ఉన్నాయి. అదే సమయంలో మెక్సికో జట్టు బలమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థికి గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు. దీంతో 0-0తో తొలి అర్ధభాగం ముగిసింది.

మొదటి హాఫ్‌లో బలమైన డిఫెన్స్‌తో అర్జెంటీనాకు ఎటువంటి అవకాశాన్నీ ఇవ్వలేదు మెక్సికో. దీంతో ఆట చాలా బోరింగ్‌గా సాగింది. అయితే సెకండ్ హాఫ్‌లో ఆట మలుపు తిరిగింది. ఏం స్ట్రాటజీ వేసుకుందో తెలియదు కానీ 64వ నిమిషంలో మెక్సికో జట్టు.. మైదానంలో కొంత వెనకడుగు వేసింది. దీన్ని ఉపయోగించుకున్న అర్జెంటీనా ముందుకు దూసుకొచ్చింది. ఈ క్రమంలోనే లియోనెల్ మెస్సీ అద్భుతమైన లాంగ్ షాట్‌తో గోల్ చేసి తమ జట్టుకు 1-0 ఆధిక్యం అందించాడు.

Lionel Messi equals Diego Maradona record as Argentina defeats Mexico

దీంతో ఆందళన చెందిన మెక్సికో.. వెంటనే మరో గోల్ చేసి స్కోర్లు సమం చేయాలని ప్రయత్నించింది. కానీ ఈ ప్రయత్నాల్లో ఒక్కటి కూడా ఫలించలేదు. అలాంటి సమయంలోనే అర్జెంటీనా యువ సంచలనం ఎంజో ఫెర్నాండెజ్ మరో గోల్ కొట్టాడు. ఆ తర్వాత మెక్సికో కోలుకోలేకపోయింది. ఇధి అర్జెంటీనా బెస్ట్ మ్యాచ్ అని చెప్పలేం కానీ.. ఈ మ్యాచ్ కూడా ఓడి ఉంటే తర్వాతి దశకు చేరుకోవడం ఆ జట్టుకు అసాధ్యంగా మారేది.

గ్రూప్-డీలో పోలండ్ అగ్రస్థానంలో ఉంది. ఆ జట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. మెక్సికోపై విజయంతో అర్జెంటీనా పాయింట్ల సంఖ్య మూడుకు చేరింది. దీంతో ఆ జట్టు రెండో స్థానంలో నిలిచింది. అర్జెంటీనాపై తొలి పోరులో నెగ్గిన సౌదీ అరేబియా మూడ స్థానంలో ఉండగా.. ఒకే ఒక్క పాయింటుతో మెక్సికో చివరి స్థానంలో ఉంది.

Story first published: Sunday, November 27, 2022, 8:58 [IST]
Other articles published on Nov 27, 2022
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X