న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

AIFF కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన కల్యాణ్ చౌబే..!

Kalyan Chaubey Elected as New President Of AIFF

ఆల్‌ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్‌ఎఫ్) కొత్త అధ్యక్షుడిగా భారత మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు కల్యాణ్ చౌబే శుక్రవారం ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన ఏఐఎఫ్ఎఫ్ ఎన్నికల్లో చౌబే 33-1 తేడాతో భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ భైచుంగ్ భూటియాపై గెలుపొందాడు. ఇద్దరు మాజీ భారత ఫుట్‌బాల్ స్టార్ల మధ్య రేసులో చౌబే చాలా ముందున్నాడు. 45 ఏళ్ల చౌబేకు గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్ తదితర రాజకీయంగా ముఖ్యమైన రాష్ట్ర సంఘాల మద్దతును కూడబట్టుకోవడం కలిసొచ్చింది. అందువల్లే అతనికి గెలుపు దక్కిందని చెప్పొచ్చు.

కల్యాణ్ చౌబే పశ్చిమ బెంగాల్‌కు చెందిన భాజపా నాయకుడు. అతనికి ఈ స్పోర్ట్స్ బాడీ పోల్స్‌లో తప్పనిసరిగా రాజకీయ పరమైన మద్దతు లభిస్తుందని ముందు నుంచే అందరికీ అంచనా ఉంది. ఇకపోతే క్రీడల విషయంలో ఈశాన్య భారతానికి చెందిన ఓ ప్రధాన రాజకీయ దిగ్గజం నుంచి బ్లెస్సింగ్స్ ఉన్నాయని కూడా పేర్కొంటుంటారు. అందువల్లే భారత ఫుట్‌బాల్‌‌కు కొన్నేళ్లు పాటు పర్యాయపదంగా ఉన్న భూటియాకు ఈశాన్య రాష్ట్రమైన సిక్కిం రాష్ట్ర సంఘం నుంచి అతనికి మద్దతు దక్కకపోవడానికి ఇదే కారణమని భావిస్తున్నారు. ఇకపోతే జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ ఎన్నికలు కూడా జరగనున్నాయి.

రాజస్థాన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మన్వేంద్ర సింగ్ ఉపాధ్యక్ష పదవికి ఎన్‌ఎ హరీస్‌పై పోటీకి దిగారు. హరీస్ కర్ణాటక FA అధ్యక్షుడు. ఆ రాష్ట్రానికి చెందిన సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం పనిచేస్తున్నాడు. ఇకపోతే కోశాధికారి పదవికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘం అధ్యక్షుడు గోపాలకృష్ణ కొసరాజు, అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన కిపా అజయ్‌లు ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇకపోతే ఇటీవల ఏఐఎఫ్ఎఫ్‌పై విధించిన నిషేధాన్ని ఫిఫా కేంద్రం చొరవతో ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫిఫా బాడీకి సంబంధించిన ఎన్నికలు జరిగాయి. అక్టోబర్‌లో జరిగే ఫిఫా మహిళల అండర్ -17 ప్రపంచ‌కప్‌ ఇండియాలోనే సజావుగా జరగనుంది.

Story first published: Friday, September 2, 2022, 19:59 [IST]
Other articles published on Sep 2, 2022
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X