హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో హైదరాబాద్ ఎఫ్‌సీ జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. కేరళ బ్లాస్టర్స్‌తో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 1-5 గోల్స్ తేడాతో ఓడిపోయింది. కేరళ బ్లాస్టర్స్ జట్టులో ఓగ్బిచె (33వ, 75వ), డ్రోబరోవ్ (39వ), రఫెల్ మెస్సీ బౌలి (45వ), సత్యసేన్ సింగ్ (59వ) గోల్స్ సాధించారు.
పది మ్యాచ్‌ల తర్వాత కేరళ బ్లాస్టర్స్ మరో విజయాన్ని సాధించింది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో విజయం సాధించిన కేరళ మళ్లీ 11వ మ్యాచ్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. ఫలితంగా ఈ సీజన్ ఆరంభంలో హైదరాబాద్ చేతిలో ఎదురైన ఓటమికి కేరళ బ్లాస్టర్స్ బదులు తీర్చుకున్నట్లు అయింది.
మీరు మాకు గర్వకారణం... ఇప్పుడు మా వంతు: కపిల్ బర్త్‌డే సందర్భంగా రణవీర్
ఇక, హైదరాబాద్ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను బొబొ (14వ నిమిషంలో) సాధించాడు. ఇండియన్ సూపర్ లీగ్‌లో 5 గోల్స్ చేయడం కేరళకు ఇదే తొలిసారి కావడం విశేషం. కాగా, టోర్నీలో భాగంగా సోమవారం ఒడిశా ఎఫ్‌సీతో చెన్నైయిన్ ఎఫ్‌సీ తలపడుతుంది.
మైఖేల్‌లో ఫాంటసీ పుట్‌బాల్ ఆడండి. బహుమతులు గెలవండి