న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ISL 2020 21: ఛాంపియన్ ముంబై.. ఫైనల్లో మోహన్‌బగాన్‌కు నిరాశ!!

ISL 2020-21: Bipin Singh shine Mumbai City FC wins title, beats ATK Mohun Bagan

మార్గావ్‌ (గోవా): ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఏడో సీజన్‌ టైటిల్‌ను ముంబై సిటీ ఎఫ్‌సీ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఏటీకే మోహన్‌ బగాన్‌పై 2-1తో విజయం సాధించిన ముంబై తొలిసారి ఐఎస్‌ఎల్‌ విజేతగా నిలిచింది. చివరి నిమిషంలో బిపిన్‌ సింగ్‌ (90వ నిమిషం) గోల్‌ చేయడంతో ముంబై గెలిచింది. తమ ఆటగాడే ప్రత్యర్థికి గోల్‌ ఇవ్వడం.. ఆఖర్లో దురదృష్టం వెంటాడడంతో మోహన్‌బగాన్‌కు నిరాశ తప్పలేదు.

మ్యాచ్ ఆరంభంలో ఏటీకే మోహన్‌ బగాన్‌దే జోరు సాగింది. 18వ నిమిషంలో డేవిడ్‌ విలియమ్స్‌ కొట్టిన గోల్‌తో ఏటీకే ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే కొద్దిసేపటికే మోహన్‌ బగాన్‌కు షాక్‌ తగిలింది. ప్రత్యర్థి కొట్టిన బంతిని ఆపే క్రమంలో ఏటీకే ఆటగాడు జోస్‌ లూయిస్‌ (29వ నిమిషం) తమ సొంత గోల్‌ పోస్టులోకి బంతిని పంపేయడంతో స్కోరు సమమైంది. దాదాపు మ్యాచ్‌ ఆఖరి వరకు మరో గోల్‌ పడకపోవడంతో పోటీ అదనపు సమయానికి మళ్లేలా కనిపించింది.

ఇక 90వ నిమిషంలో బిపిన్‌సింగ్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఒజ్‌బెచె అందించిన పాస్‌ను నెట్‌లోకి పంపిన అతడు ముంబైకి 2-1తో ఆధిక్యాన్ని అందించాడు. స్కోరు సమం చేయడానికి మోహన్ ‌బగాన్‌ తీవ్రంగా ప్రయత్నించి విఫలం అయింది. 90 నిమిషాలు ముగిశాక ఇంజ్యూరీ టైమ్‌గా అదనంగా నాలుగు నిమిషాలు ఆడించారు. ఈ నాలుగు నిమిషాలు ముంబై జట్టు ప్రత్యర్థిని నిలువరించి విజయాన్ని ఖాయం చేసుకుంది.

విజేత ముంబై సిటీకి రూ. 8 కోట్లు.. రన్నరప్‌ మోహన్‌ బగాన్‌కు రూ. 4 కోట్లు ప్రైజ్‌మనీ లభిం చాయి. గోల్డెన్‌ బూట్‌ అవార్డును సీజన్‌లో 14 గోల్స్‌ చేసిన ఇగోర్‌ (గోవా) దక్కించుకోగా.. గోల్డెన్‌ గ్లవ్‌ అవార్డు మోహన్‌ బగాన్‌ గోల్‌కీపర్‌ ఆరిందమ్‌ భట్టాచార్య పొందాడు. బెంగళూరు తర్వాత (2018-2019 సీజన్‌) లీగ్‌ దశలో టాప్‌ ర్యాంక్‌లో నిలువడంతో పాటు టైటిల్‌నూ నెగ్గిన రెండో జట్టుగా ముంబై గుర్తింపు పొందింది.

ఆ ఇద్దరికి ఆట పట్ల అంకిత భావం లేదు.. సువర్ణవకాశాన్ని చేజార్చుకున్నారు!ఆ ఇద్దరికి ఆట పట్ల అంకిత భావం లేదు.. సువర్ణవకాశాన్ని చేజార్చుకున్నారు!

Story first published: Sunday, March 14, 2021, 10:40 [IST]
Other articles published on Mar 14, 2021
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X