న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఇద్దరు నిషేధిత ప్లేయర్లతో ఇరాన్ ‘సాకర్’ జట్టు ఎంపిక

 Iran announce FIFA World Cup 2018 squad, includes banned footballers

హైదరాబాద్: సౌదీ అరేబియాతో పోటీ పడుతున్న ఇరాన్ ఫుట్‌బాల్ సమాఖ్య వచ్చే నెల 14వ తేదీ నుంచి రష్యాలో జరుగనున్న సాకర్ కప్ సంరంభంలో పాల్గొనే జట్టును ఎంపిక చేసింది. మసౌద్ షోజాయి, ఎహ్సాన్ హజి సఫీలకు కూడా చోటు కల్పించింది. ఇజ్రాయెల్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో మిడ్ ఫీల్డర్లు మసౌద్ షోజాయి, ఎహ్సాన్ హాజీ సఫీ వ్యవహర శైలికి గాను వారిద్దరిపై నిషేధించింది.

35 మంది ఫుట్‌బాల్ ఆటగాళ్లు ఎంపిక

35 మంది ఫుట్‌బాల్ ఆటగాళ్లు ఎంపిక

ఇద్దరు ప్లేయర్లపై ఇజ్రాయెల్ నిషేధం మసౌద్ షోజాయి, ఎహ్సాన్ హాజి సఫీతోపాటు 35 మంది ఫుట్‌బాల్ ఆటగాళ్లను ఎంపిక చేసినట్లు ఇరాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ వెబ్‌సైట్‌లో చేర్చింది. గతేడాది ఆగస్టులో ఇజ్రాయెల్ టీంపై గ్రీక్ క్లబ్ పానైనైస్ జట్టు తరఫున ఆడిన ప్లేయర్లు షోజాయి, హాజి సఫాయిలను జీవిత కాలం నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఇజ్రాయెల్ నిర్ణయాన్ని గుర్తించని ఇరాన్ ఫుట్‌బాల్ సమాఖ్య తమ జట్టులో చోటు కల్పించింది. కానీ ఈ విషయమై బహిరంగంగా చర్చించబోమని, అలా చేస్తే అంతర్జాతీయ క్రీడా నిబంధనలను ఉల్లంఘించినట్లవుతుందని ఇరాక్ ఫుట్‌బాల్ సమాఖ్య పేర్కొంది.

నెదర్లాండ్స్ క్లబ్ తరఫున 21 గోల్స్ చేసిన అలిరె జహన్ బక్ష్

నెదర్లాండ్స్ క్లబ్ తరఫున 21 గోల్స్ చేసిన అలిరె జహన్ బక్ష్

నిషేధిత ఆటగాళ్లను ఎంపిక చేయడం ఆశ్చర్యకరమేమీ లేదు. నెదర్లాండ్స్ క్లబ్ తరఫున ఆడుతున్న మిడ్ ఫీల్డర్ అలిరెజా జహన్‌బక్ష్‍ను ఇరాన్ ఫుట్‌బాల్ సమాఖ్య ఎంపిక చేసింది. నెదర్లాండ్స్ క్లబ్ ఎజడ్ అల్క్‌మార్ తరుఫున మేజర్ యూరోపియన్ లీగ్ టోర్నీలో తొలి ఆసియా ప్లేయర్ అలిరెజా జహన్ బక్ష్ 21 గోల్స్ చేసిన టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

స్పెయిన్-పోర్చుగల్-మొరాకోతో ఇరాన్ పోటీ

స్పెయిన్-పోర్చుగల్-మొరాకోతో ఇరాన్ పోటీ

వరల్డ్ కప్ టోర్నీలో ఇరాన్ జట్టు కఠినమైన స్పెయిన్, పోర్చుగల్, మొరాకో జట్ల గ్రూపులో పోటీ పడుతోంది. ఆసియాన్ ఫుట్‌బాల్ కాన్ఫిడరేషన్ (ఎఎఫ్సీ)లో తొలుత క్వాలిఫై అయిన జట్టు ఇరాన్ కావడం గమనార్హం. ఇరాన్ జట్టు తరఫున మూడో తరఫున మసూద్ సొజాయి ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇజ్రాయెల్ తనపై విధించిన నిషేధంపై అస్పష్టంగా సమాధానం చెప్పిన మసూద్ షోజాయి జట్టు కోసం ఒక సైనికుడిగా వచ్చానని చెప్పాడు.

మినర్వా పంజాబ్ ఎఫ్‌సీ ఓనర్ రంజిత్ బజాజ్‌పై ఎఐఎఫ్ఎఫ్ సస్పెన్షన్

మినర్వా పంజాబ్ ఎఫ్‌సీ ఓనర్ రంజిత్ బజాజ్‌పై ఎఐఎఫ్ఎఫ్ సస్పెన్షన్

ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన మినర్వా పంజాబ్ ఎఫ్‌సీ క్లబ్ యజమాని రంజిత్ బజాజ్‌ను ఏడాది పాటు సస్పెండ్ చేస్తున్నట్లు అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) తెలిపింది. అన్ని రకాల ఫుట్‌బాల్ కార్యక్రమాల్లోనూ నిషేధించానని పేర్కొన్నది. అంతటితో ఆగక ఆయనపై రూ. 10 లక్షల జరిమాన విధించింది. ఈ ఏడాది రంజిత్ బజాజ్ తప్పిదాలకు పాల్పడటం ఇది నాలుగోసారి. తాజాగా యూ-18 టోర్నీలో ఈ నెల 12వ తేదీన షిల్లాంగ్‌లో ఐజ్వాల్ ఎఫ్‌సీ, మినర్వా పంజాబ్ ఎఫ్‌సీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1 - 1 తేడాతో డ్రా అయిన నేపథ్యంలో రిఫరీ ఫైంఖెమ్హామే మాంథోహ్‌ను రంజిత్ బజాజ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

రిఫరీని దుర్భాషలాడినందుకే రంజిత్ బజాజ్‌పై ఇలా నిషేధం

రిఫరీని దుర్భాషలాడినందుకే రంజిత్ బజాజ్‌పై ఇలా నిషేధం

రిఫరీ మాంథోహ్‌ను దుర్భాషలాడాడని ఎఐఎఫ్ఎఫ్ క్రమశిక్షణా కమిటీ చైరమన్ ఉషానాథ్ బెనర్జీ తెలిపారు. ఎఐఎఫ్ఎఫ్ క్రమశిక్షణా కమిటీ నిర్ణయం షాకింగ్, దిగ్భ్రాంతికరం అని మినర్వా పంజాబ్ ఎఫ్‌సీ జట్టు ఒక ప్రకటనలో తెలిపింది. మ్యాచ్ నిర్వహణ సందర్భంగా జరిగిన పొరపాటుకు రంజిత్ బజాజ్ క్షమాపణ చెప్పారని పేర్కొంది. లీగ్ నిర్వహణలో భద్రతా వైఫల్యం, యాజమాన్యంలో తప్పుడు పద్దతుల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని పంజాబ్ మినర్వా ఎఫ్ సీ క్లబ్ తెలిపింది.

Story first published: Thursday, May 24, 2018, 11:02 [IST]
Other articles published on May 24, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X