న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ప్రపంచంలోనే మూడో వాడిగా ఛెత్రి, ప్రోత్సాహమిస్తే ప్రాణాలైనా పణంగాపెడతా

Intercontinental Cup: Sunil Chhetri scores brace in 100th game as India beat Kenya, make final

హైదరాబాద్: ఎడతెరిపిలేని వర్షం మైదాన్నంతా ముంచేసినా.. వేగం తగ్గించుకోకుండా.. విజయకాంక్ష చల్లార్చుకోకుండా పోరాడి నిలిచింది భారత్. అంతకుముందు టీమిండియా కెప్టెన్ సునీల్ ఛెత్రి చేసిన అభ్యర్థనకు స్పందించిన భారత క్రీడాభిమానులు స్టేడియమంతా నిండిపోయారు. దీంతో ఎన్నడూ లేని రీతిలో ఫ్యాన్స్ రావడంతో ఫుట్‌బాల్ ఎరీనా కొత్త రూపు సంతరించుకుంది. సోమవారం కెన్యాతో జరిగిన ఇంటర్‌కాంటినెంటల్ కప్‌లో ఆతిథ్య భారత్ 3-0 తేడాతో ఘనవిజయం సాధించింది.

ఆట ఆరంభం నుంచే భారత్‌ అటాకింగ్‌ గేమ్‌

ఆట ఆరంభం నుంచే భారత్‌ అటాకింగ్‌ గేమ్‌

భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో ఈనెల 7న న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఛెత్రి (68వ, 90వ నిమిషం) రెండు గోల్స్‌ చేయగా.. జెజె లాల్‌పెక్లుయా (71వ) మరో గోల్‌ చేశాడు. రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన భారత్‌ ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలతో టీమిండియా దాదాపు ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. భారీ వర్షం మధ్య సాగిన మ్యాచ్‌లో.. ఆట ఆరంభం నుంచే భారత్‌ అటాకింగ్‌ గేమ్‌ ఆడింది. కొన్ని అవకాశాలను సృష్టించుకున్నా గోల్‌గా మలచలేకపోయింది.

పెనాల్టీ ఏరియాలో సునీల్‌ను కిందపడేయడంతో

పెనాల్టీ ఏరియాలో సునీల్‌ను కిందపడేయడంతో

మరోవైపు కెన్యా కూడా అడపాదడపా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోవడంతో ఫస్టాఫ్‌ 0-0తో ముగిసింది. బ్రేక్‌ తర్వాత భారత్‌ మరింతగా చెలరేగి పోయింది. ప్రత్యర్థి గోల్‌ పోస్టుపై పదేపదే దాడులతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ద్వితీయార్ధంలో కెన్యా ఆటగాళ్లు దురుసుగా ప్రవర్తించడం భారత్‌కు కలిసొచ్చింది. పెనాల్టీ కిక్ రూపంలో దక్కిన అవకాశాన్ని సునీల్ గోల్‌గా మలిచి బోణీ కొట్టాడు. అయితే 68వ నిమిషంలో పెనాల్టీ రూపంలో భారత్‌ ఖాతా తెరిచింది. పెనాల్టీ ఏరియాలో సునీల్‌ను కిందపడేయడంతో రెఫరీ పెనాల్టీ కిక్‌ ఇచ్చాడు. దీనిని ఛెత్రీ గోల్‌గా మలచి భారత్‌కు ఆధిక్యాన్నందించాడు. మూడు నిమిషాల వ్యవధిలోనే కెన్యా ఆటగాడు కొట్టిన రీబౌండ్‌ను జెజె ఫెకులా గోల్ చేయడంతో భారత్ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

ఇలా ప్రొత్సహిస్తే.. ప్రాణాలను కూడా పణంగా పెడతాం

ఇలా ప్రొత్సహిస్తే.. ప్రాణాలను కూడా పణంగా పెడతాం

మ్యాచ్ అదనపు సమయంలో కెన్యా డిఫెండర్లను కంగుతినిపిస్తూ బల్వంత్‌సింగ్ అందించిన పాస్‌ను సునీల్ గోల్ చేయడంతో అభిమానులు సంబురాల్లో మునిగి తేలారు. మ్యాచ్ ముగిసిన అనంతరం కెప్టెన్ సునీల్, సహచర ఆటగాళ్లతో కలిసి అందరికీ అభివాదం చేశాడు. మైదానానికి వచ్చి మమ్మల్ని ఇలా ప్రొత్సహిస్తే.. మా ప్రాణాలను కూడా పణంగా పెడతాం అని సునీల్ ఉద్వేగంగా అన్నాడు. గురువారం జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్‌ తలపడనుంది.

రొనాల్డో, మెస్సీ తర్వాత.. మూడో వాడిగా

రొనాల్డో, మెస్సీ తర్వాత.. మూడో వాడిగా

సునీల్ ఛెత్రి అరుదైన రికార్డు అందుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో 100వ మ్యాచ్ ఆడిన సునీల్(61)..స్పెయిన్ ఆటగాడు డేవిడ్ విల్లా(59)ను అధిగమించాడు. ఈ క్రమంలో క్రిస్టియానో రొనాల్డో(81), లియోనల్ మెస్సీ(64) తర్వాత అత్యధిక గోల్స్ చేసిన మూడో ఆటగానిగా ఛెత్రి నిలిచాడు.

Story first published: Tuesday, June 5, 2018, 13:10 [IST]
Other articles published on Jun 5, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X