For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

విజయం కోసం పరితపిస్తోన్న హైదరాబాద్ ఎఫ్‌సి: కొత్త కోచ్‌గా అల్బర్ట్‌ రోకా

Hyderabad FC appoint Albert Roca as the new head coach

హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో పేలవ ప్రదర్శన చేస్తోన్న హైదరాబాద్ ఎఫ్‌సి జట్టులో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ ఎఫ్‌సీ కొత్త కోచ్‌గా అల్బర్ట్‌ రోకాను నియమించుకుంది. ఈ మేరుకు ఆ జట్టు సహ యజమాని వరుణ్‌ త్రిపురనేని ఆదివారం అధికారిక ప్రకటన చేశారు.

ఈ నేపథ్యంలో అల్బర్ట్‌ రోకా మాట్లాడుతూ "తిరిగి ఐఎస్‌ఎల్‌లో అడుగుపెట్టబోతున్నందుకు సంతోషంగా ఉంది. హైదరాబాద్‌తో నా ప్రయాణంలో సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. జట్టును బలంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తా" అని తెలిపాడు. ఈ ఒప్పందంలో భాగంగా అల్బర్ట్‌ రోకా హైదరాబాద్ ఎఫ్‌సి జట్టుతో రెండేళ్ల పాటు కలిసి పని చేయనున్నారు.

స్పెయిన్‌కు చెందిన అల్బర్ట్‌ రోకా గతంలో ఎఫ్‌సీ బార్సిలోనా జట్టుకు సహాయక కోచ్‌గా పని చేశారు. ఆ తర్వాత బెంగళూరు ఎఫ్‌సీ కోచ్‌గా ఆ జట్టును ఏఎఫ్‌సీ కప్‌, ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫైనల్స్‌కు చేర్చాడు. దీంతో పాటు బెంగళూరు ఎఫ్‌సి జట్టు ఫెడరేషన్‌ కప్‌, సూపర్‌ కప్‌ టైటిళ్లు గెలవడంలో కీలకంగా వ్యవహారించాడు.

ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో హైదరాబాద్ ఎఫ్‌సి తొలిసారి ఈ సీజన్‌తో బరిలో నిలిచింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ ఎఫ్‌సి ఒక్కదాంట్లో గెలిచి, రెండు మ్యాచ్‌లను డ్రా చేసుకోలిగింది. ఫలితంగా తొమ్మిది మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది.

Story first published: Monday, January 13, 2020, 12:12 [IST]
Other articles published on Jan 13, 2020
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+