న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫిఫా వరల్డ్ కప్: బెల్జియం-పనామ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించిన రిషి తేజ్

By Nageshwara Rao
How India’s Rishi Tej created history during Belgium-Panama FIFA World Cup 2018 game

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో భారత్ ప్రాతినిధ్యం వహించింది. నిజానికి ఈ మెగా టోర్నీలో భారత పుట్‌బాల్ జట్టు పాల్గొనడం లేదు కదా? ఇదెలాగ సాధ్య పడిందని అనుకుంటున్నారా? ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా మ్యాచ్‌ ప్రారంభానికి ముందు అధికారిక బంతిని పాఠశాల విద్యార్థులు మైదానంలోకి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే.

1
958058
ఫిఫా ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా

ఫిఫా ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా

ఇందుకోసం ఫిఫా ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా 64 మంది పాఠశాల విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ జాబితాలో భారత్‌కు చెందిన రిషి తేజ్‌, నతనియా జాన్‌‌లు ఉన్నారు. టోర్నీలో భాగంగా సోమవారం బెల్జియం, పనామా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు రిషి తేజ్‌ అధికారిక బంతిని మైదానంలోకి తీసుకువచ్చాడు.

తొలి భారతీయుడిగా రిషి చరిత్ర

తొలి భారతీయుడిగా రిషి చరిత్ర

సోచి వేదికగా బెల్జియం-పనామా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫిఫా అధికారిక మ్యాచ్ బంతిని తీసుకొచ్చే వారిని అఫీసియల్ మ్యాచ్ బాల్ కారియర్స్(ఓఎమ్బీసీ) అంటారు. ఫిఫా ప్రపంచకప్‌లో ఇలా అధికారిక బంతిని మైదానంలోకి తీసుకువెళ్లిన తొలి భారతీయుడిగా రిషి చరిత్ర సృష్టించాడు.

ఆనందానికి గురయ్యాను

ఆనందానికి గురయ్యాను

ఈ సందర్భంగా కర్ణాటకకు చెందిన 10 ఏళ్ల రిషి తేజ్‌ మాట్లాడుతూ "ఈ సమయంలో నేను ఎంతో ఆనందానికి గురయ్యాను. ఇప్పటికీ నేను ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నాను. మ్యాచ్‌ చూస్తూ ఎంజాయ్‌ చేయలేదు. ఆటగాళ్లు ఎలా ఆడుతున్నారన్న దానిపై దృష్టి పెట్టా. ఇలాంటి అరుదైన అవకాశం దక్కినందుకు ఎంతో సంతోషంగా ఉంది" అని అన్నాడు.

వారం రోజులపాటు నాకు నిద్రపట్టలేదు

వారం రోజులపాటు నాకు నిద్రపట్టలేదు

"వరల్డ్‌కప్ కోసం రష్యా వెళ్లడానికి ముందు వారం రోజులపాటు నాకు నిద్రపట్టలేదు" అని రిషి తెలిపాడు. ఇదిలా ఉంటే వరల్డ్ కప్ టైటిల్ ఫేవరేట్లలో ఒకటిగా ఉన్న బెల్జియం జట్టు పనామాపై 3-0తో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ ఆద్యంతం బెల్జియం తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇక, రెండో విద్యార్థి నతనియా జాన్‌ తమిళనాడుకు చెందినవాడు కాగా, జూన్ 22న బ్రెజిల్‌-కోస్టారికా మధ్య జరిగే మ్యాచ్‌కు జాన్‌ బంతిని అందివ్వనున్నాడు.

Story first published: Tuesday, June 19, 2018, 12:13 [IST]
Other articles published on Jun 19, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X