న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

Euro cup 2020: 55 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు ఇంగ్లండ్.. ఇటలీతో టైటిల్ ఫైట్!!

Harry Kane helps England beat Denmark 2-1 and enter Euro 2020 final

లండన్‌: యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌ (యూరో) 2020లో ఇంగ్లండ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భాగంగా వెంబ్లీ స్టేడియంలో బుధవారం డెన్మార్క్‌తో జరిగిన పోరులో 2-1 తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. 55 ఏళ్ల తర్వాత ఓ మేజర్‌ టోర్నీలో సెమీస్‌ను దాటి ఫైనల్‌కు వెళ్లడం ఇంగ్లండ్ జట్టుకు ఇదే తొలిసారి. ఆదివారం జరిగే టైటిల్ పోరులో ఇంగ్లీష్ జట్టు ఇటలీని ఢీకొట్టనుంది. 1966 ప్రపంచకప్‌ తర్వాత సెమీస్‌లో ఇంగ్లండ్ గెలవడం ఇదే తొలిసారి.

Wimbledon 2021లో హర్కజ్‌ సంచలనం.. ఫెదరర్‌కు షాక్‌! సెమీస్‌లో జకోవిచ్‌, షపొవలోవ్‌!Wimbledon 2021లో హర్కజ్‌ సంచలనం.. ఫెదరర్‌కు షాక్‌! సెమీస్‌లో జకోవిచ్‌, షపొవలోవ్‌!

ఆసక్తికరంగా సాగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో డెన్మార్క్‌పై తొలి నుంచి ఇంగ్లండ్ జట్టే ఆధిపత్యం ప్రదర్శించింది. 30వ నిమిషంలో డెన్మార్క్‌ ఆటగాడు డ్యామ్స్‌గార్డ్‌ పెనాల్టీ కిక్‌ను అద్భుతంగా గోల్‌ చేసి ఆ జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అయితే డెన్మార్క్‌ ఆటగాళ్ల తప్పిదంతో ఇంగ్లండ్ (39 నిమిషాల్లో) స్కోర్‌ను సమం చేసింది. ఆపై ఇరు జట్లు మరో గోల్ చేయలేదు. దీంతో నిర్ణీత సమయంలో డెన్మార్క్‌, ఇంగ్లండ్ జట్లు చెరో గోల్‌ చేసి సమంగా నిలవడంతో ఆట ఆదనపు సమయానికి దారితీసింది.

ఆదనపు సమయంలో ఇంగ్లండ్ అందివచ్చిన అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకుంది. ఇంగ్లీష్ ఆటగాడు హారీ కేన్‌ పెనాల్టీ కిక్‌ను గోల్‌గా (104వ నిమిషంలో) మలిచాడు. డెన్మార్క్‌ పోరాడినా మరో గోల్‌ చేయలేకపోయింది. దీంతో డెన్మార్క్‌ ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 10 సార్లు గోల్‌ లక్ష్యం దిశగా వెళ్లగా.. డెన్మార్క్‌ కేవలం మూడు సార్లు మాత్రమే వెళ్లింది. ఇదే డెన్మార్క్ ఓటమికి కామరణమైంది.

ఇక కోపా అమెరికా కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో లియోనెల్‌ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా సెమీస్‌లో గెలిచి బ్రెజిల్‌తో టైటిల్‌ సమరానికి రెడీ అయింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన సెమీస్‌లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్‌ ద్వారా 3-2 తేడాతో కొలంబియాను ఓడించింది. అర్జెంటీనా గోల్‌ కీపర్‌ ఎమిలియానో మర్టినెజ్‌ షూటౌట్‌లో మూడుసార్లు బంతి గోల్‌పోస్ట్‌కు వెళ్లకుండా ఆపి జట్టును గెలిపించాడు. మ్యాచ్‌లో ఏడో నిమిషంలోనే లాటారో మార్టినెజ్‌ గోల్‌ బాదడంతో అర్జెంటీనా ఖాతా తెరిచింది. ఆ తర్వాత రెండో కొలంబియా ప్లేయర్‌ లూయిస్‌ డియాజ్‌ (61వ నిమిషంలో) గోల్‌తో స్కోర్లు సమమయ్యాయి. దీంతో పెనాల్టీ షూటౌట్‌ తప్పనిసరైంది.

Story first published: Thursday, July 8, 2021, 8:04 [IST]
Other articles published on Jul 8, 2021
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X