న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

రొనాల్డో హ్యాట్రిక్ గోల్స్: కన్నీళ్లు పెట్టుకున్న ప్రేయసి (వీడియో)

Cristiano Ronaldo Hat-Trick Makes Girlfriend Georgina Rodriguez Cry Tears Of Joy - Watch

హైదరాబాద్: ప్రపంచంలోని అత్యుత్తమ ఫుట్‌బాల్ ప్లేయర్లలో క్రిస్టియానో రొనాల్డో ఒకడు. తాజాగా ఛాంపియన్ లీగ్ క్వార్టర్ ఫైనల్లో రొనాల్డో హ్యాట్రిక్ గోల్స్‌తో జట్టును భారీ ఆధిక్యంతో గెలిపించాడు. ఈ మ్యాచ్ చూడడానికి వచ్చిన రొనాల్డో గర్ల్ ఫ్రెండ్ జార్జినా రొడ్రిగేజ్‌... హ్యాట్రిక్ గోల్స్ చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది.

<strong>ఐపీఎల్ 2019: ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారుగా సౌరవ్ గంగూలీ</strong>ఐపీఎల్ 2019: ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారుగా సౌరవ్ గంగూలీ

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఛాంపియన్స్ లీగ్‌లో భాగంగా నాకౌట్ దశ రెండో లీగ్ మ్యాచ్ ఇటలీలోని టురిన్ నగరంలో మంగళవారం జరిగింది. జువెంటస్ జట్టు అట్లెటికో మాడ్రిడ్‌ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో జ్యూవెంటస్ జట్టు 3 గోల్స్ చేసి అట్లెటికొ మాడ్రిడ్‌ను క్లీన్ స్వీప్ చేసింది.

మ్యాచ్‌ 27వ నిమిషంలో

మ్యాచ్‌ 27వ నిమిషంలో

మ్యాచ్‌ 27వ నిమిషంలో జువెంటస్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో తొలి గోల్ సాధించాడు. దీంతో తొలి అర్థభాగం చివరికల్లా 1-0 తేడాతో జువెంటస్ జట్టు ఆధిక్యంలో నిలిచింది. తదనంతరం జరిగిన రెండో అర్థభాగంలో రొనాల్డో తన రెండో గోల్ సాధించాడు. ఆపై పెనాల్టీతో మరో గోల్ సాధించి అదరగొట్టాడు. దీంతో 3-0 తేడాతో జువెంటస్ విజయం సాధించింది.

మైదానంలోనే భావోద్వేగానికి గురైన ప్రేయసి

ఈ విజయంతో ఛాంపియన్స్ లీగ్ క్వార్టర్ ఫైనల్లోకి చేరుకుంది. అనంతరం రొనాల్డోకు మద్దతుగా ఆయన ఫ్యాన్స్ ప్రశంసలతో ముంచెత్తారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన రొనాల్డొను చూసిన అతని గర్ల్ ఫ్రెండ్ మైదానంలోనే భావోద్వేగానికి గురైంది. కన్నీటితో తన ఆనందాన్ని వ్యక్తపరిచింది.

ఇది నీ అంకితభావానికి నిదర్శనం

ఆ సన్నివేశాన్ని తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ "3-0స్కోరును ఎవ్వరూ చెరపలేరు. ఇది నీ అంకితభావానికి నిదర్శనం. జట్టు కోసం పడిన కష్టం వృథాగా పోదు. జట్టు సహచరులకు నువ్వొక ట్రైలర్ లాంటి వాడివి. కోచ్‌తో పాటు ఈ విజయానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు. దేవుడికి తెలుసు నీకేం ఇవ్వాలో. ప్రపంచ ఫుట్‌బాల్ నీదే. క్రిస్టియానిటో, మాటో, అలానా, జార్జినా మీరంటే మాకెంతో ఇష్టం" అని కామెంట్ పెట్టింది.

రొనాల్డొ మాట్లాడుతూ

మ్యాచ్ అనంతరం మాట్లాడిన రొనాల్డొ "ఈ రోజు మాకెంతో ప్రత్యేకం. గోల్స్ గురించి కాదు. జట్టు బాగా సహకరించింది. మానసికంగా మేం చాంపియన్స్. జువెంటస్ నన్ను కొనుగోలు చేసిందానికి అర్థం ఇదే" అని తెలిపాడు. కాగా, రొనాల్డో ఇప్పటివరకు యూరప్ క్లబ్ పోటీల్లో 124 గోల్స్ సాధించాడు. తద్వారా ప్రపంచ ఫుట్ బాల్ పోటీల్లో అత్యధిక గోల్స్ సాధించిన లియోనల్ మెస్సీకి తర్వాతి స్థానంలో నిలిచాడు.

Story first published: Thursday, March 14, 2019, 17:14 [IST]
Other articles published on Mar 14, 2019
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X