కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో AFC ఆసియా కప్ క్వాలిఫయర్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ మధ్య శనివారం ఉత్కంఠభరితంగా సాగింది. ఇక ఈ మ్యాచ్ ముగిసే టైంలో మూడు గోల్స్ నమోదయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్ ఒక గోల్ చేయగా.. భారత్ రెండు గోల్స్ చేసింది. దీంతో భారత్ గెలుపొందింది. ఇక ఫైనల్ విజిల్ తర్వాత ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తోపులాట జరిగింది. ఇరు జట్లకు సంబంధించి ఇద్దరు ప్లేయర్ల మధ్య గొడవ మొదలు కాగా.. అది తోపులాటకు దారి తీసింది. ఇక అనంతరం మిగతా ఆటగాళ్లు సైతం గ్రౌండ్లోకి పరుగెత్తుకుంటూ వచ్చి ఒకరి మీద ఒకరు పిడిగుద్దులు కురిపించుకోవడంతో అక్కడ గొడవ తీవ్రమైంది. ఇకపోతే ఆఫ్ఘనిస్తాన్ రిజర్వ్ ఆటగాడు ఒకరు భారత గోల్ కీపర్ గురుప్రీత్ సింగ్ సంధు ముఖంపై కొట్టడం వీడియోలో కనిపించింది. ఇక ఈ విషయమై సంబంధిత అధికారులు విచారణ జరుపుతున్నారు.
India vs Afghanistan Fight 🔥🔥#IndianFootball #ISL #BlueTigers pic.twitter.com/jlvU1P8CKe
— Navaneed M 🏳️🌈 (@mattathil777777) June 12, 2022
ఇక ఈ మ్యాచ్ జరుగుతుండగా.. కొంతమంది భారతీయ మద్దతుదారులతో ఆఫ్ఘనిస్తాన్ అభిమానులు సైతం వాగ్వాదానికి దిగడంతో క్రౌడ్‌లో చాలా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఒక భారతీయ అభిమానిని భద్రతా సిబ్బంది స్టేడియం నుంచి తొలగించినట్లు సమాచారం. ఈ మ్యాచ్‌లో 85నిమిషాల పాటు ఇరు జట్లు ఒక్క గోల్ కూడా కొట్టలేదు. ఇక భారత టాలిస్మానిక్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ అద్భుతమైన ఫ్రీ-కిక్‌తో గోల్ సాధించడంతో ఇండియా లీడ్‌లోకి వచ్చింది. అయితే ఆఫ్ఘనిస్థానీ ప్లేయర్ అమీరి గోల్ కొట్టడంతో మ్యాచ్ 1-1గా మారింది. ఇక మ్యాచ్ డ్రా ముగుస్తుందనుకునే టైంలో ఇంజూరీ విషయంలో కేరల ప్లేయర్ సాహల్ అబ్దుల్ సమద్ అద్భుతమైన గోల్ చేశాడు. దీంతో భారత్ 2-1తో గెలుపొందింది.