న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాంబు పేల్చిన యువరాజ్: కోహ్లీ పనిభారం సమీక్షించి.. టీ20 కెప్టెన్సీని రోహిత్‌కు ఇవ్వండి

IND V SA 2019 : Rohit Sharma Can Captain In T20Is To Manage Virat Kohli's Workload Says Yuvraj Singh
 Yuvraj Singh tips Team India to split captaincy between Virat Kohli and Rohit Sharma

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పని భారాన్ని పరిగణనలోకి తీసుకుని కెప్టెన్సీని విభజించాలని టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నాడు. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో భారత క్రికెట్ జట్టు విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో విరాట్‌ కోహ్లీకి భారంగా అనిపిస్తే జట్టు మేనేజ్‌మెంట్ రోహిత్‌శర్మకు టీ20 కెప్టెన్సీని అప్పగిస్తే బాగుంటుందని యువరాజ్ సూచించాడు. మోడ్రన్ డే క్రికెట్‌లో ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో టీమిండియాకు నాయకత్వం వహిస్తున్నాడు.

పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో రోహిత్ శర్మ వైస్ కెప్టెన్‌గా

పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో రోహిత్ శర్మ వైస్ కెప్టెన్‌గా

ఇక, రోహిత్ శర్మ వైస్ కెప్టెన్‌గా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కొనసాగుతున్నాడు. టెస్టుల్లో మాత్రం వైస్ కెప్టెన్‌గా అజ్యింకె రహానే కొనసాగుతున్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్)లో రోహిత్‌శర్మ అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా మన్ననలు అందుకుంటున్నాడు. ముంబై ఇండియన్స్‌ను రోహిత్ శర్మ నాలుగు సార్లు విజేతగా నిలిపాడు.

యువరాజ్ మాట్లాడుతూ

యువరాజ్ మాట్లాడుతూ

తాజాగా ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో యువరాజ్ మాట్లాడుతూ "గతంలో రెండు ఫార్మాట్లే ఉండేవి కాబట్టి కెప్టెన్‌కు పనిభారం తక్కువగా ఉండేది. ఇప్పుడు మూడు ఫార్మాట్లు ఉన్నాయి. విరాట్‌పై పనిభారం పెరిగితే టీ20 ఫార్మాట్‌కు మరొకరని కెప్టెన్‌గా ప్రయత్నించొచ్చు. రోహిత్‌ అత్యంత విజయవంతమైన నాయకుడు" అని అన్నాడు.

కోహ్లీ ఎంత పనిభారం మోయగలడో

కోహ్లీ ఎంత పనిభారం మోయగలడో

"విరాట్ కోహ్లీ ఎంత పనిభారం మోయగలడో నాకు తెలీదు. అది జట్టు మేనేజ్‌మెంట్‌కు తెలుస్తోంది. టీ20ల్లో ఎవరినైనా ప్రయత్నించాలని వారు భావిస్తున్నారా? భవిష్యత్తులో ఎలా ముందుకు పోవాలనుకుంటున్నారో అన్న దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. విరాట్ కోహ్లీ బెస్ట్ బ్యాట్స్‌మన్. అతడు తన పనిభారాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నాడో? నిర్ణయం తీసుకోవాల్సింది జట్టు యాజమాన్యమే" అని యువరాజ్ అన్నాడు.

తన కెరీర్ ఆరంభం నుంచీ

తన కెరీర్ ఆరంభం నుంచీ

"మీరు నన్ను అడిగితే, తన కెరీర్ ఆరంభం నుంచీ రోహిత్ శర్మ ఓపెనర్‌గా ఆడాడా? ఒక మ్యాచ్ ఆడించి, మరోక మ్యాచ్‌కు అతడు సరిగా పరుగులు చేయడం లేదని జట్టు నుంచి తప్పిస్తారు. పది టెస్టుల్లో కూడా సరైన అవకాశాలు ఇవ్వకుండా అతడు బాగా ప్రదర్శన చేయాలని ఎలా కోరుకుంటారు" అని యువరాజ్ ప్రశ్నించాడు.

రోహిత్ శర్మను ఓపెనర్‌గా

రోహిత్ శర్మను ఓపెనర్‌గా

"ఇప్పుడు రోహిత్ శర్మను ఓపెనర్‌గా టెస్టుల్లో పరీక్షిస్తున్నారు. అతడికి ఆరు టెస్టుల్లో అవకాశం ఇవ్వండి. 10-12 ఇన్నింగ్స్‌ల్లో నీ గేమ్ నువ్వు ఆడు అని అతడితో చెప్పండి, అప్పుడు ఎవరూ ఏం మాట్లాడరు కదా?" రోహిత్ శర్మను ఓపెనర్‌గా ప్రమోట్ చేయడంపై యువరాజ్ పైవిధంగా స్పందించాడు.

Story first published: Friday, September 27, 2019, 19:29 [IST]
Other articles published on Sep 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X