న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు: అంకెల్లో యువరాజ్ సింగ్ కెరీర్

Yuvraj Singh retires: His career in numbers

హైదరాబాద్: 19 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు సేవలందించిన టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సోమవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. భార్య, తల్లితో కలిసి ముంబైలోని ఓ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో 37 ఏళ్ల యువీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

భారత్ తరుపున మొత్తం 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన యువరాజ్ 1900 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక, వన్డేల్లో 304 మ్యాచ్‌లాడి 14 సెంచరీలు, 52 హాఫ్‌ సెంచరీలతో 8701 పరుగులు చేశాడు. 58 టీ20 మ్యాచ్‌లాడిన యువీ 8 ఆఫ్‌ సెంచరీలతో 1177 పరుగులు చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించుకున్నాడు. కెరీర్ తొలినాళ్లలో ఫినిషర్‌గా, ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా, ఆల్‌రౌండర్‌గా భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 2012లో చివరిగా టెస్టు మ్యాచ్‌ ఆడిన యువరాజ్ 2017లో ఆఖరి వన్డే, టీ20 ఆడాడు.

యువరాజ్ సింగ్ కెరీర్ గణాంకాలను ఒక్కసారి పరిశీలిస్తే:

301 - భారత్ తరుపున మొత్తం 304 వన్డేలాడిన యువరాజ్ 301 సార్లు బరిలోకి దిగాడు. దీంతో భారత్ తరుపున అత్యధిక వన్డేలాడిన ఆరో ఆటగాడిగా యువరాజ్ నిలిచాడు.

8609 - యువీ కంటే కేవలం ఆరుగురు భారత బ్యాట్స్‌మెన్ మాత్రమే అత్యధిక పరుగులు చేశారు.

40 - యువరాజ్ ఆడిన టెస్టులు. టెస్టుల్లో 1900 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

169 - టెస్టుల్లో యువరాజ్ అత్యధిక స్కోరు. 2007లో పాకిస్థాన్‌పై ఈ స్కోరు నమోదు చేశాడు.

58 - యువరాజ్ ఆడిన టీ20లు. 8 ఆఫ్‌ సెంచరీలతో 1177 పరుగులు చేశాడు.

12 - టీ20ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. దీని కోసం 12 బంతులు తీసుకున్నాడు. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో యువీ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లోనే యువరాజ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదాడు.

1 - 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో 6 బంతులకు 6 సిక్స్‌లు కొట్టి నయా ట్రెండ్‌ సృష్టించాడు. ఈ క్రమంలో యువరాజ్ సింగ్ ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే ఓవర్‌లో ఆరు సిక్సుర్లు బాదిన సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్, రవిశాస్త్రి, గిబ్స్ సరసన నిలిచాడు. ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లను ఆరుగురు బ్యాట్స్‌మన్ బాదారు.

Story first published: Monday, June 10, 2019, 19:17 [IST]
Other articles published on Jun 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X