న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC final: ఇంగ్లాండ్‌లో కోహ్లీ సేన ఎంజాయ్ మామూలుగా లేదుగా

WTC final: Team India players touches down Southampton in UK
India Test Squad In Southampton ఫొటోలు దిగుతూ Rohit, Rishabh | WTC Final || Oneindia Telugu

లండన్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC final) మ్యాచ్ దిశగా మరో కీలక ఘట్టానికి తెర లేచింది. ఈ మ్యాచ్‌లో ఆడటానికి ఇంగ్లాండ్‌కు బయలుదేరి వెళ్లిన భారత క్రికెట్ జట్టు.. సౌథాంప్టన్‌లో దిగింది. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ నిర్వహించబోయేది ఇక్కడే. సౌథాంప్టన్‌లోని రోజ్ బౌల్ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 18వ తేదీన డబ్ల్యూటీసీ ఫైనల్ ఆరంభం కానుంది. టీమిండియా..న్యూజిలాండ్‌ జట్టును ఢీ కొట్టనుంది. ప్రస్తుతం జట్టు మొత్తం సౌథాంప్టన్‌లోని హోటల్‌లో బస చేస్తోంది. బ్యాగులు సర్దేసిన వెంటనే క్రికెటర్లు రోజ్ బౌల్ స్టేడియానికి చేరుకున్నారు. ఫొటోలు దిగారు.

టెస్ట్ మ్యాచే అయినప్పటికీ.. హైఓల్టేజ్

అయిదు రోజుల పాటు సాగే టెస్ట్ క్రికెట్టే అయినప్పటికీ- అందరి కళ్లూ ఆ మ్యాచ్‌ మీదే నిలిచాయి. ఈ ఫార్మట్‌లో తొలిసారిగా ఛాంపియన్‌షిప్‌ను ఏర్పాటు చేయడమే దీనికి కారణం. టెస్ట్ క్రికెట్ ఆడే హోదా ఉన్న అన్ని జట్లూ ఇందులో పాల్గొన్నాయి. అత్యధిక పాయింట్లను టీమిండియా, కివీస్ జట్లు ఫైనల్‌కు చేరాయి. భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుపై నాలుగు టెస్ట్ సిరీస్‌లను 3-1 తేడాతో గెలుచుకోవడం ద్వారా కోహ్లీసేన ఈ ఫైనల్‌లో అడుగు పెట్టింది. భారత జట్టు ఖాతాలో మొత్తం 72.2 శాతం పాయింట్లు ఉన్నాయి. 70 పాయింట్లతో కివీస్ రెండో స్థానంలో నిలిచి, ఫైనల్‌కు అర్హత పొందింది.

ఛార్టెడ్ ఫ్లైట్‌లో

ఈ మ్యాచ్ అనంతరం భారత జట్టు ఇంగ్లాండ్‌నే మరి కొంత కాలం గడుపుతుంది. 42 రోజుల వ్యవధి తరువాత ఇంగ్లాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. అయిదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఇది. తొలి టెస్ట్ ఆగస్టు 4వ తేదీన ఆరంభమౌతుంది. చివరిదైన అయిదో మ్యాచ్ సెప్టెంబర్ 14వ తేదీన ముగుస్తుంది. అప్పటిదాకా కోట్లీ సేన ఇంగ్లాండ్‌లోనే ఉంటుంది. సుదీర్ఘమైన సిరీస్ కావడం వల్ల క్రికెటర్లతో పాటు వారి భార్యా, బిడ్డలు కూడా తమదేశంలో పర్యటించడానికి బ్రిటన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనితో వారంతా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఏర్పాటు చేసిన ప్రత్యేక ఛార్టెడ్ ఫ్లైట్‌లో సౌథాంప్టన్‌కు చేరుకున్నారు.

అక్కడా క్వారంటైనే..

బ్రిటన్ ప్రభుత్వం అమలు చేస్తోన్న కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం.. భారత్ నుంచి ఎవరు తమ దేశానికి వచ్చినప్పటికీ.. క్వారంటైన్ తప్పదు. ప్రస్తుతం భారత జట్టు కూడా క్వారంటైన్‌లో కాలక్షేపం చేస్తోంది. హోటల్‌లో దిగిన తరువాత వారు అక్కడి నుంచి నేరుగా రోజ్‌బౌల్ స్టేడియానికి చేరుకున్నారు. అనంతరం సెల్ఫీలు దిగారు. అక్కడి నుంచి క్వారంటైన్‌కు వెళ్లారు. ఆర్టీపీసీఆర్ నివేదికలను స్థానిక అధికారులకు అందజేశారు. తమ లేటెస్ట్ ఫొటోలను క్రికెటర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, వైస్ కెప్టెన్ ప్లస్ ఓపెనర్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్ ఈ ఫొటోల్లో సందడి చేస్తూ కనిపించారు.

Story first published: Friday, June 4, 2021, 9:31 [IST]
Other articles published on Jun 4, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X