న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

World Cup 2019: భారత క్రికెటర్లను ఊరిస్తోన్న పలు రికార్డులివే

World Cup 2019: Approaching milestones for the Indian players

హైదరాబాద్: వన్డేల్లో గత పదేళ్లుగా టీమిండియా నిలకడగా రాణిస్తోంది. గత నాలుగు ఐసీసీ వన్డే ఈవెంట్లలో మెరుగైన ప్రదర్శన చేయడంతో పాటు టాప్-4లో నిలుస్తోంది. గత నాలుగు టోర్నీల్లో టీమిండియా ఆడిన 27 మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది. ఇక, వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీల విషయానికి వస్తే 17 మ్యాచ్‌ల్లో కేవలం 2 మ్యాచ్‌ల్లోనే ఓడింది.

సీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆరంభమయ్యే వన్డే వరల్డ్‌కప్‌లో టైటిల్ ఫేవరేట్ జట్లలో టీమిండియా ఒకటి. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా గత కొన్నేళ్లుగా మంచి ప్రదర్శన చేస్తోంది. కాగా, 20 ఏళ్ల తర్వాత మరోసారి వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ వేదికగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ 12వ ఎడిషన్ కావడం విశేషం.

మే30 నుంచి జులై 14వరకు జరగనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 46 రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నీకి ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి(1975, 1979, 1983, 1999). యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి.

జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది. ఈ వరల్డ్‌కప్‌లో పలువురు భారత క్రికెటర్లు అనేక మైలురాళ్లను తమ ఖాతాలో వేసుకోన్నారు. అవేంటో ఒక్కసారి చూద్దాం.

వంద వికెట్ల క్లబ్‌లో కుల్దీప్

వంద వికెట్ల క్లబ్‌లో కుల్దీప్

100 - వన్డేల్లో కుల్దీప్ యాదవ్(87), జస్ప్రీత్ బుమ్రా(85) వంద వికెట్లకు చేరువలో ఉన్నారు. వీరిద్దరూ ఈ వరల్డ్‌కప్‌లో ఈ మైలురాయిని అందుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో మహ్మద్ షమీ నమోదు చేసిన 56 మ్యాచ్‌ల్లో 100 వికెట్ల రికార్డుని ఈ ఇద్దరూ అధిగమించే అవకాశం ఉంది. తాను ఆడబోయే తదుపరి 7 మ్యాచ్‌ల్లో కుల్దీప్ యాదవ్ 13 వికెట్లు తీస్తే రషీద్ ఖాన్(44 మ్యాచ్‌ల్లో 100) తర్వాత అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా అరుదైన ఘనత సాధిస్తాడు.

ధోని మరో 9 మ్యాచ్‌లు ఆడితే

ధోని మరో 9 మ్యాచ్‌లు ఆడితే

341 - ఈ వరల్డ్‌కప్‌లో ధోని మరో 9 మ్యాచ్‌లు ఆడితే... భారత్ తరుపున 350 వన్డేలాడిన 10వ ఆటగాడిగా అరుదైన ఘనత సాధిస్తాడు.

397 - అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో రవీంద్ర జడేజా ఇప్పటివరకు పడగొట్టిన వికెట్ల సంఖ్య. మరో మూడు వికెట్లు తీస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు తీసిన 7వ ఆటగాడిగా జడేజా అరుదైన ఘనత సాధిస్తాడు.

విరాట్ కోహ్లీ బాదిన ఫోర్లు

విరాట్ కోహ్లీ బాదిన ఫోర్లు

1,973 - అన్ని ఫార్మాట్లు కలిపి భారత్ తరుపున విరాట్ కోహ్లీ ఇప్పటివరకు బాదిన ఫోర్లు. వరల్డ్‌కప్‌లో కోహ్లీ మరో 27 ఫోర్లు బాదితే 2000 అంతర్జాతీయ ఫోర్లు బాదిన 5వ భారత క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధిస్తాడు. మరోవైపు సిక్సుల విషయానికి వస్తే మరో 11 సిక్సులు బాదితే 200 అంతర్జాతీయ సిక్సులు బాదిన 7వ క్రికెటర్‌గా నిలుస్తాడు.

8,980 - శిఖర్ ధావన్ ఇప్పటివరకు నమోదు చేసిన అంతర్జాతీయ పరుగులు. ఇవన్నీ కూడా ధావన్ ఓపెనర్‌గా చేసినవి. ధావన్ మరో 20 పరుగులు చేస్తే ఓపెనర్‌గా 9000 పరుగులు చేసిన 5వ భారత ఆటగాడిగా అరుదైన ఘనత సాధిస్తాడు.

12000 పరుగుల మైలురాయికి చేరువలో

12000 పరుగుల మైలురాయికి చేరువలో

10,843 - వన్డేల్లో విరాట్ కోహ్లీ చేసిన పరుగులు. కోహ్లీ మరో 127 పరుగులు చేస్తే వన్డేల్లో 12000 పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న ఆటగాడిగా నిలుస్తాడు.

11,926 - రోహిత్ శర్మ మరో 74 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 12వేలకు పైగా పరుగులు సాధించిన 9వ క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధిస్తాడు. దీంతో పాటు వన్డేల్లో మరో ఫోర్ బాదితే 700 ఫోర్లు బాదిన 8వ భారత ఆటగాడిగా రోహిత్ శర్మ నిలుస్తాడు. రోహిత్ శర్మ వన్డేల్లో ఇప్పటివరకు 699 ఫోర్లు బాదాడు.

Story first published: Friday, May 17, 2019, 18:34 [IST]
Other articles published on May 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X