న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్ 1987: 1 పరుగుతో భారత్ ఓటమి, సీక్రెట్ చెప్పిన డీన్ జోన్స్

Dean Jones Opens Secret Behind One Run Win Against India In 1987 World Cup | Oneindia Telugu
World Cup 1987: Kapil Devs sporting spirit costs India 1-run loss vs Australia

హైదరాబాద్: కపిల్ దేవ్.... భారత్‌కు తొలి వన్డే వరల్డ్‌కప్‌ని అందించిన కెప్టెన్. అయితే, 1987 వరల్డ్‌కప్‌లో కపిల్ దేవ్ ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తి కారణంగా సొంతగడ్డపై టీమిండియా ఓడిపోయింది. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో కపిల్ దేవ్ నాయకత్వంలోని టీమిండియా ఒక పరుగు తేడాతో ఓటమిపాలైంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ మెగా టోర్నీలో భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగింది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కపిల్‌ దేవ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఆసీస్ ఓపెనర్లు మార్ష్‌ బూన్‌, జెఫ్‌ మార్ష్‌ తొలి వికెట్‌కు 110 పరుగులు జోడించారు. బూన్‌ను రవి శాస్త్రి ఔట్‌ చేసిన అనంతరం క్రీజులోకి వచ్చిన డీన్ జోన్స్ ఈ మ్యాచ్‌లో దూడుగా ఆడాడు.

మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన డీన్ జోన్స్

మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన డీన్ జోన్స్

ఈ మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన డీన్ జోన్స్ 35 బంతుల్లో 39 పరుగులు చేశాడు. అయితే, మణిందర్‌ సింగ్‌ బౌలింగ్‌లో డీన్ జోన్స్ లాంగాఫ్‌లో భారీ షాట్‌గా మలచడంతో ఆ సమయంలో అక్కడ ఫీల్డింగ్ చేసిన రవిశాస్త్రి బంతిని అందుకోలేకపోయాడు. దీంతో బంతి ఫోరా లేదా సిక్సా? అన్నది స్పష్టంగా తెలియలేదు.

ఫోర్‌ను సిక్స్‌గా

టీవీ అంఫైర్ లేకపోవడంతో రవిశాస్త్రితో మాట్లాడిన తర్వాత అంపైర్‌ డికీ బర్డ్‌ దానిని ఫోర్‌గా ప్రకటించాడు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 268/6 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను ముగించింది. తొలి ఇన్నింగ్స్ ఆనంతరం బర్డ్‌ నిర్ణయంపై బ్యాట్స్‌మన్ డీన్ జోన్స్ అంఫైర్ రూమ్‌కి వెళ్లి ఫోర్‌ను సిక్స్‌గా మార్పు చేయాలని ఒప్పించాడు.

6 వికెట్లకు 270 పరుగులు చేసిన ఆసీస్

6 వికెట్లకు 270 పరుగులు చేసిన ఆసీస్

దీంతో అంపైర్లు కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌తో మాట్లాడగా ఫోర్‌ను సిక్స్‌గా మార్చేందుకు ఒప్పుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన టీమిండియా విజయానికి ఆఖరి ఓవర్‌లో 6 పరుగులు అవసరమయ్యాయి. చేతిలో ఒక వికెట్ మాత్రమే ఉంది.

మణిందర్‌ సింగ్‌ను బౌల్డ్‌ చేసిన స్టీవ్‌ వా

మణిందర్‌ సింగ్‌ను బౌల్డ్‌ చేసిన స్టీవ్‌ వా

భారత్ విజయానికి చివరి రెండు బంతుల్లో రెండు పరుగులు చేయాల్సి ఉండగా మణిందర్‌ సింగ్‌ను ఆసీస్ యువ బౌలర్ స్టీవ్‌ వా బౌల్డ్‌ చేశాడు. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. అయితే, కపిల్ దేవ్ ఫోర్‌ను సిక్స్‌గా ఒప్పుకోకపోయి ఉంటే, ఈ మ్యాచ్‌లో భారతే ఒక పరుగు తేడాతో గెలిచి ఉండేది.

Story first published: Thursday, May 16, 2019, 15:23 [IST]
Other articles published on May 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X