వరల్డ్ టీ20: సెమీఫైనల్లో భారత్ తలపడే ప్రత్యర్ధి ఎవరో తెలుసా?

హైదరాబాద్: కరేబియన్ దీవుల్లో జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ తుది దశకు చేరుకుంది. టోర్నీలో భాగంగా సెమీఫైనల్లో తలపడే జట్లేవో సోమవారం నాటికి స్పష్టత వచ్చింది. వరుస విజయాలతో గ్రూప్-బి నుంచి భారత మహిళల జట్టు సెమీస్‌కు చేరగా, రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా కూడా సెమీస్‌కు అర్హత సాధించింది.
ఇక, గ్రూప్-ఏ నుంచి వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లు సెమీస్ చేరుకున్నాయి. ఐసీసీ నిబంధనల ప్రకారం గ్రూప్ ఏ1 vs బీ2తో, గ్రూప్ ఏ2 vs గ్రూప్ బీ1 తలపడాల్సి ఉంది. దీంతో గ్రూప్-బిలో భారత్ మహిళల వరుసగా నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది.
ఇక, ఆస్ట్రేలియా 6 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. దీంతో గ్రూప్-ఏలో వెస్టిండిస్ మహిళల జట్టు వరుస విజయాలతో 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా ఇంగ్లాండ్ 5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. దీంతో సెమీస్-1లో వెస్టిండీస్ vs ఆస్ట్రేలియా, సెమీస్-2లో భారత్ vs ఇంగ్లాండ్ జట్లు తలపడతాయి.
గతేడాది వన్డే వరల్డ్ కప్ పైనల్లో భారత్ vs ఇంగ్లాండ్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలై రన్నరప్‌గా నిలిచింది. దీంతో గత వన్డే వరల్డ్ కప్‌లో ఎదురైన ఓటమికి ఈ మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని భారత మహిళల జట్టు భావిస్తోంది.
ఇదిలా ఉంటే, నవంబర్ 22వ తేదీన రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ నవంబర్ 22(గురువారం) ఉదయం 5:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications