న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాకు సెలక్టర్‌ కావాలనుంది.. కానీ అవకాశం ఇచ్చేదెవరు: సెహ్వాగ్ ట్వీట్

Virendra Sehwag Wants To Be A ‘Team Selector’ || Oneindia Telugu
 Will Virender Sehwag get a chance to become selector?


హైదరాబాద్:
తనకు సెలక్టర్‌ కావాలనుందని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లో ట్వీట్ చేయడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత సెహ్వాగ్ ట్విట్టర్‌లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత క్రికెటర్ల నుంచి మాజీ క్రికెటర్ల వరకు తనదైన శైలిలో ట్విట్టర్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంటాడు.

<strong>నా నుంచి అద్భుతాలు ఆశించొద్దు: లార్డ్స్‌లో టెస్టు అరంగేట్రంపై జోఫ్రా ఆర్చర్</strong>నా నుంచి అద్భుతాలు ఆశించొద్దు: లార్డ్స్‌లో టెస్టు అరంగేట్రంపై జోఫ్రా ఆర్చర్

తాజాగా సోమవారం సెహ్వాగ్ తన ట్విట్టర్‌లో "నాకు సెలక్టర్‌ కావాలనుంది. కానీ అవకాశం ఇచ్చేదెవరు" అంటూ కామెంట్ పోస్టు చేశాడు. సాధారణంగా సెహ్వాగ్ తన ట్విట్టర్ ఖాతాలో ఎక్కువగా సరదా సందేశాలే పెడుతుంటాడు కాబట్టి.. ఈ ట్వీట్‌ ఉద్దేశమేంటన్నది అతనే చెప్పాలి మరి.

అంతర్జాతీయ క్రికెట్‌లో విధ్వంసకర ఓపెనర్లలో ఒకడిగా పేరుగాంచిన సెహ్వాగ్ తన అరంగేట్ర టెస్టులోనే సెంచరీ సాధించాడు. 2001లో దక్షిణాఫ్రికాతో జరిగిన అరంగేట్ర టెస్టులో సెంచరీ సాధించడం ద్వారా భారత తరుపున ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు.

ఆ తర్వాత 2007 వరల్డ్ టీ20, 2011 వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఇక, టెస్టు క్రికెట్‌లో తొలి ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్ సెహ్వాగే కావడం విశేషం. కాగా, 2015లో సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

ప్రస్తుతం జాతీయ సెలక్షన్ కమిటీకి ఎమ్మెస్కే ప్రసాద్ ఛీఫ్‌గా ఉన్నారు. మొత్తం ఐదుగురితో కూడిన ఈ కమిటీలో ఎమ్మెస్కే ప్రసాద్, దేవాంగ్ గాంధీ, శరణ్‌దీప్ సింగ్, జతిన్ పరాంజీ, గగన్ ఖోడా ఉన్నారు. ఇక, ఎమ్మెస్కే ప్రసాద్ విషయానికి వస్తే టీమిండియా తరుపున ఆరు టెస్టులు ఆడాడు.

Story first published: Tuesday, August 13, 2019, 12:25 [IST]
Other articles published on Aug 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X