న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గొప్ప అవకాశం, బుమ్రాని చూసి మరింత నేర్చుకుంటా: నవదీప్ సైనీ

Will now get a chance to interact about my bowling with Jasprit Bumrah: Navdeep Saini

హైదరాబాద్: టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో తన బౌలింగ్ గురించి చర్చించే అవకాశం ఇప్పుడు లభించిందని యువ పేసర్ నవదీప్ సైనీ అన్నాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా గువహటి వేదికగా ఆదివారం శ్రీలంకతో టీమిండియా తొలి టీ20తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు జట్లు గువహటికి చేరుకున్నాయి.

ఈ నేపథ్యంలో సైనీ మాట్లాడుతూ "నా బలహీనతలు, లోపాల్ని బుమ్రాతో పంచుకుంటాను. అతడి బౌలింగ్‌ చూసి మరింత నేర్చుకుంటాను. నా బౌలింగ్‌ను మెరుగుపర్చుకోవాడానికి ఇదో మంచి అవకాశం. దాని కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్‌, సిరీస్‌ నాకు ఎంతో కీలకం" అని అన్నాడు.

ఒక పరుగు కోసం సుదీర్ఘ నిరీక్షణ: అప్పట్లో ద్రవిడ్‌... ఇప్పుడు స్టీవ్ స్మిత్ (వీడియో)ఒక పరుగు కోసం సుదీర్ఘ నిరీక్షణ: అప్పట్లో ద్రవిడ్‌... ఇప్పుడు స్టీవ్ స్మిత్ (వీడియో)

"మైదానంలో రాణించడంతో పాటు జట్టు విజయంలో నా పాత్ర ఉంటేనే మంచి బౌలర్‌గా ఎదుగుతాను. భవిష్యత్తు గురించి ఆలోచించి దిగులుపడను. ఆ తర్వాతి మ్యాచ్‌పై మాత్రమే దృష్టిసారిస్తాను. ఆ మ్యాచ్‌లో నా ఉత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తాను. 2019లో చేసిన కృషికి మంచి ఫలితం లభించింది" అని సైనీ చెప్పాడు.

సులేమానీ మృతి ఎఫెక్ట్: ఖతార్ ట్రైనింగ్ క్యాంప్‌ని రద్దు చేసుకున్న యుఎస్ పుట్‌బాల్ టీమ్సులేమానీ మృతి ఎఫెక్ట్: ఖతార్ ట్రైనింగ్ క్యాంప్‌ని రద్దు చేసుకున్న యుఎస్ పుట్‌బాల్ టీమ్

బుమ్రాతో కలిసి సైనీ ఇప్పటివరకు బంతిని పంచుకోలేదు. భారత పేసర్లు భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ, దీపక్‌ చాహర్‌ జట్టులో లేకపోవడంతో బుమ్రాతో కలిసి నవదీప్‌ సైనీ పేస్‌ విభాగంలో సత్తాచాటేందుకు ఎదురుచూస్తున్నాడు. భారత్ తరఫున సైనీ 5 టీ20లు ఆడి ఆరు వికెట్లు, ఒక వన్డేలో రెండు వికెట్లు పడగొట్టాడు.

Story first published: Saturday, January 4, 2020, 15:00 [IST]
Other articles published on Jan 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X