న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎందుకంటే!: టీ20ల్లో టీమిండియాపై 200 స్కోరు సైతం సురక్షితం కాదు!

Why even 200-plus totals are not safe against India in T20I cricket

హైదరాబాద్: ఆక్లాండ్ వేదికగా శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలి టీ20లో విజయం సాధించడంతో 5 టీ20ల సిరిస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకుంది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. న్యూజిలాండ్ జట్టులో ముగ్గురు ఆటగాళ్లు కొలిన్ మున్రో( 59), కేన్ విలియమ్సన్‌(51), రాస్‌ టేలర్‌(54 నాటౌట్‌)లు హాఫ్‌ సెంచరీలతో చెలరేగారు.

<strong>మా గెలుపుకు అదే కారణం.. మేం అందులో మెరుగవ్వాలి : కోహ్లీ</strong>మా గెలుపుకు అదే కారణం.. మేం అందులో మెరుగవ్వాలి : కోహ్లీ

భారీ లక్ష్యంతో

భారీ లక్ష్యంతో

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టులో ఇద్దరు భారత ఆటగాళ్లు హాఫ్‌ సెంచరీలు నమోదు చేశారు. కేఎల్‌ రాహుల్‌(56), శ్రేయస్‌ అయ్యర్‌(58 నాటౌట్‌)లు హాఫ్ సెంచరీలతో చెలరేగి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఫలితంగా ఒక అంతర్జాతీయ టీ20లో ఐదుగురు బ్యాట్స్‌మన్లు యాభైకి పరుగుల్ని సాధించడం ఇదే తొలిసారి.

టార్గెట్‌ను అత్యధిక సార్లు సాధించిన జట్టుగా

టార్గెట్‌ను అత్యధిక సార్లు సాధించిన జట్టుగా

దీంతో అంతర్జాతీయ టీ20ల్లో 200కుపైగా పరుగులు, ఆపై టార్గెట్‌ను అత్యధిక సార్లు సాధించిన జట్టుగా టీమిండియా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకూ టీ20ల్లో నాలుగుసార్లు 200 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. భారత్ తర్వాత ఈ జాబితాలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది.

ఆస్ట్రేలియా రెండుసార్లు

ఆస్ట్రేలియా రెండుసార్లు

ఆస్ట్రేలియా రెండుసార్లు ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా చేధించిన స్కోరు మూడో అత్యధిక స్కోరు కావడం విశేషం. 2009లో శ్రీలంకతో మొహాలీ వేదికగా జరిగిన టీ20లో భారత్‌ 207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగా, 2013లో ఆస్ట్రేలియాతో రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌ 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

టీ20లో 208 పరుగుల లక్ష్యాన్ని

టీ20లో 208 పరుగుల లక్ష్యాన్ని

గతేడాది హైదరాబాద్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టీ20లో 208 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్‌లు ఒకసారి మాత్రమే 200కుపైగా లక్ష్యాన్ని ఛేదించిన జట్లుగా ఉన్నాయి.

భారత్ 200 లేదా అంతకంటే ఎక్కువ స్కోరుని 6సార్లు

భారత్ 200 లేదా అంతకంటే ఎక్కువ స్కోరుని 6సార్లు

టీ20ల్లో టార్గెట్‌ను విజయవంతంగా చేజ్ చేసిన సమయంలో భారత్ 200 లేదా అంతకంటే ఎక్కువ స్కోరుని 6సార్లు చేసింది. అయితే, ఇందులో రెండు సార్లు టార్గెట్ 2 పరుగుల కంటే తక్కువగా ఉన్నప్పుడు చేధించింది. ఒకటి బ్రిస్టల్ 2018 వర్సెస్ ఇంగ్లాండ్: టార్గెట్ 199, రెండోది సిడ్నీ 2016 వర్సెస్ ఆస్ట్రేలియా: టార్గెట్ 198.

Story first published: Friday, January 24, 2020, 17:51 [IST]
Other articles published on Jan 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X