న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో పోల్: స్మిత్‌ను ఔట్ చేసే మొనగాడు బుమ్రానే!

Who can stop Steve Smith? ‘Jasprit Bumrah 100%,’ says former England pacer

హైదరాబాద్: 85, 142, 144, 92, 211 ప్రస్తుతం ఇంగ్లీషు గడ్డపై జరుగుతున్న యాషెస్ సిరిస్‌లో స్టీవ్ స్మిత్ గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో చేసిన పరుగులివి. ఈ యాషెస్‌ సిరీస్‌లో స్టీవ్‌ స్మిత్‌ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. స్మిత్‌ ప్రదర్శనపై మాజీ క్రికెటర్లు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో 'స్టీవ్ స్మిత్ అద్భుతమైన బ్యాటింగ్... అతడిని ఆపాలి.. అతడి వికెట్‌ తీసే బౌలర్‌ ఎవరు?' అంటూ జేమ్స్‌ అండర్సన్‌, జస్ప్రీత్‌ బుమ్రా, కగిసో రబాడ, మోర్నీ మోర్కెల్‌, జోఫ్రా ఆర్చర్‌, రవీంద్ర జడేజా, యాసిర్‌ షా, రంగనా హెరాత్‌ పేర్లతో కూడిన ఓ పోల్‌ను ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది.

చాలా పెద్ద బాధ్యత: సఫారీ పర్యటనపై కొత్త బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్చాలా పెద్ద బాధ్యత: సఫారీ పర్యటనపై కొత్త బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్

ఈ పోస్టుకు ఇంగ్లాండ్ మాజీ పేసర్ డారెన్ గాఫ్ 'బుమ్రా 100%' అంటూ కామెంట్‌ చేశాడు. యాషెస్‌ సిరీస్‌ ద్వారా టెస్టుల్లో రీ ఎంట్రీ ఇచ్చిన స్మిత్‌ తొలి టెస్టులో (144, 142), రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేశాడు. రెండో టెస్టులో ఆర్చర్‌ వేసిన బంతికి గాయపడిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో, మూడో టెస్టుకు దూరమయ్యాడు.

Who can stop Steve Smith? ‘Jasprit Bumrah 100%,’ says former England pacer

ఇక, మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో ఇన్నింగ్స్‌లో స్మీత్ ఇంగ్లాండ్‌ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. నాలుగో టెస్టులో స్టీవ్ స్మిత్ సెంచరీ సాధించడంతో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌‌ను 497/8 వద్ద డిక్లేర్‌ చేసింది. ఈ నేపథ్యంలో క్రిక్‌ఇన్ఫో పెట్టిన పోస్టుకు స్పందించిన డారెన్ గాఫ్ ఆ సత్తా బుమ్రాకే ఉందని అన్నాడు.

ఇటీవలే వెస్టిండిస్‌తో జరిగిన టెస్ట్‌ సిరిస్‌లో బుమ్రా అద్భుతమైన బౌలింగ్‌తో రాణించాడు. తొలి టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన బుమ్రా.. రెండో టెస్టులో హ్యాట్రిక్‌ సాధించిన సంగతి తెలిసిందే.

Story first published: Friday, September 6, 2019, 19:33 [IST]
Other articles published on Sep 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X