న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యార్కర్ల నట్టూకు ఏమైంది? ఆసీస్ టూర్ తర్వాత టీమిండియాకు ఎందుకు దూరమయ్యాడు?

 Where Is T Natarajan? Why He Is Not Getting Chance For Team India?

హైదరాబాద్: 'టీ నటరాజన్ జట్టులో ఉంటే తాము టీ20 ప్రపంచకప్ గెలిచేవాళ్లం'..టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి నోట వచ్చిన మాట ఇది. ఈ సీజన్ ఐపీఎల్ సందర్భంగా మళ్లీ కామెంట్రీ చెప్పిన రవి శాస్త్రి ఓ మ్యాచ్ సందర్భంగా నటరాజన్ ప్రదర్శనను ప్రశంసిస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు. అంతలా ప్రభావం చూపిన నటరాజన్‌.. టీమిండియాకు ఎందుకు దూరమయ్యాడు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. ఐపీఎల్ 2020 సంచలన ప్రదర్శనతో టీమిండియా పిలుపును అందుకున్న నటరాజన్.. నెట్ బౌలర్‌గా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు.

 అనూహ్య అవకాశంతో..

అనూహ్య అవకాశంతో..

వరుణ్ చక్రవర్తి గాయంతో భారత టీ20 జట్టులోకి వచ్చిన నటరాజన్.. నవ్‌దీప్ సైనీ గాయంతో మూడో వన్డేలో ఆడి అరంగేట్ర మ్యాచ్‌లో సత్తా చాటాడు. ఆ తర్వాత టీ20 సిరీస్‌లోనూ పాల్గొని అదరగొట్టిన నటరాజన్, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డుకి అర్హుడిగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మన్ననలు అందుకున్నాడు. ఇషాంత్ శర్మ గాయం నుంచి కోలుకోకపోవడంతో టెస్టు సిరీస్‌కి కూడా ఎంపికయ్యాడు. ఉమేశ్ యాదవ్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, హనుమ విహారి, కేఎల్ రాహుల్ వంటి కీలక ప్లేయర్లు గాయపడడంతో నటరాజన్ సుదీర్ఘ ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే సత్తా చాటి చారిత్రాత్మక విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.

దెబ్బతీసిన గాయం..

దెబ్బతీసిన గాయం..

ఆ తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న నటరాజన్.. ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో పాల్గొన్నాడు. అయితే ఈ సిరీస్ సందర్భంగా మొకాలి గాయానికి గురైన అతను జట్టుకు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకొని ఐపీఎల్ 2021 సీజన్‌లో పాల్గొన్న రెండు మ్యాచ్‌ల కంటే ఎక్కువ ఆడలేకపోయాడు. గాయం తిరగబెట్టడంతో పాటు కరోనా బారిన పడి మైదానానికి దూరమయ్యాడు.

ఐపీఎల్ 2022లో సత్తా చాటినా..

ఐపీఎల్ 2022లో సత్తా చాటినా..

ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున మళ్లీ బరిలోకి దిగిన నటరాజన్‌.. 11 మ్యాచులు ఆడి 18 వికెట్లు తీసి మంచి పర్ఫామెన్సే కనబర్చాడు. సన్‌రైజర్స్‌ తరుపున ఉమ్రాన్ మాలిక్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అయితే ఉమ్రాన్ మాలిక్ సంచలన ప్రదర్శనతో పాటు టీమ్ చెత్త ప్రదర్శన కారణంగా నట్టు పెర్ఫామెన్స్‌కు గుర్తింపు దక్కలేదు. అయితే గతంతో పోలిస్తే అతను ధారళంగా పరుగులిచ్చాడు. దాంతో సెలెక్టర్లు కూడా అతన్ని పట్టించుకోలేదు. అర్షదీప్, హర్షల్ పటేల్ సత్తా చాటడంతో వారికి అవకాశాలు దక్కాయి.

అన్యాయం... కెప్టెన్సీ మార్పు పట్ల నెటిజన్ల విమర్శలు *Cricket | Telugu OneIndia
నట్టూ ఉంటే బాగుండు..

నట్టూ ఉంటే బాగుండు..

ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయపడడం.. టీ20 ప్రపంచకప్ ఆడటం సందేహంగా మారిన పరిస్థితుల్లో నటరాజన్ ఉంటే జట్టుకు కలిసొచ్చేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా ఆసీస్ పిచ్‌లు నటరాజన్‌కు సరిగ్గా సరిపోతాయని కామెంట్ చేస్తున్నారు.

అయితే 31 ఏళ్ల లేటు వయసులో టీమిండియాలోకి సంచలన ఎంట్రీ ఇచ్చిన నట్టూ, గాయాల కారణంగా అంతే వేగంగా జట్టు నుంచి దూరమయ్యాడు. లైన్ అండ్ లెంగ్త్ పక్కాగా ఫాలో అవుతూ రెండు వైపుల బంతిని స్వింగ్ చేస్తూ యార్కర్లు వేయగల నట్టూ... తన ఫిట్‌నెస్ విషయంలో మాత్రం సరైన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యాడు.

Story first published: Friday, August 12, 2022, 16:26 [IST]
Other articles published on Aug 12, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X