న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చరిత్రలో ఇదే ప్రథమం: వికెట్ల వెనుక ధోని ప్రజెన్స్ ఆఫ్ మైండ్

మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా నాగ్ పూర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

By Nageshwara Rao

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా నాగ్ పూర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ధోని కొన్ని నిమిషాల పాటు మ్యాచ్‌ని నిలిపివేయించాడు. ప్రపంచ అత్యుత్తమ వికెట్ కీపర్లలో ధోని ఒకడు. స్టంప్స్ వెనుకన ధోని ప్రజెన్స్ ఆఫ్ మైండ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.

ఈ మ్యాచ్‌లో సరిగ్గా అదే జరిగింది. నాగ్ పూర్ టీ20లో 145 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు 7 ఓవర్లకు గాను 42 పరుగులు చేసింది. జో రూట్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక బెయిల్‌లో ఎల్ఈడీ లైట్లు వెలగకపోవడాన్ని ధోని గమనించాడు. దీంతో వెంటనే ఫీల్డ్ అంఫైర్లకు చెప్పి మ్యాచ్ ఆపించి ఆ బెయిల్‌ను మార్పించాడు.

When MS Dhoni called fourth umpire on ground during 2nd T20I to replace a bail

ఇలా మ్యాచ్ జరుగుతున్న మధ్యలో బెయిల్ మార్చడం క్రికెట్‌ చరిత్రలో ఇదే ప్రథమం. అంతర్జాతీయ క్రికెట్‌కు బీసీసీఐ అందించిన అత్యుత్తమ వికెట్ కీపర్లలో ధోని ఒకడు. ధోని 2004 నుంచి 2016 వరకూ మొత్తం 444 మ్యాచ్‌లలో 151 స్టంపింగ్‌లు చేసి ప్రపంచ రికార్డుని నెలకొల్పాడు. 139 స్టెంపింగ్‌‌తో రెండో స్థానంలో శ్రీలంక ఆటగాడు కుమార సంగర్కర ఉన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X