న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ధోనీ నన్ను తిట్టేవాడు, ఆపదలో ఉన్నప్పుడు అతడి చిట్కాలనే గుర్తు చేసుకుంటా'

Deepak Chahar Reveals How MS Dhoni Helped Him Become A Better Cricketer || Oneindia Telugu
When in trouble, I recall Dhoni bhais tips: Hat-trick man Deepak Chahar

హైదరాబాద్: ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నేను మహీ భాయ్ చిట్కాలను గుర్తుచేసుకుంటానని టీమిండియా పేసర్ దీపక్ చాహర్ చెప్పుకొచ్చాడు. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్యూలో మ్యాచ్‌లో క్లిష్ట పరిస్థితుల్లో ఎలా వ్యవహారిస్తారన్న ప్రశ్నకు గాను తనదైన శైలిలో స్పందించాడు.

దీపక్ చాహర్ మాట్లాడుతూ "క్రెడిట్ మొత్తం ఐపీఎల్‌కే ఇవ్వాలనుకుంటున్నాను. చెన్నై సూపర్‌కింగ్స్‌, ధోనీ భాయ్‌ వద్ద నేనెంతో నేర్చుకున్నా. బ్యాట్స్‌మన్‌ దేహభాషను గుర్తించి దానికి అనుగుణంగా ఎలా బౌలింగ్ చేయాలో నేర్చుుకున్నా. ఈ విషయాలన్నీ అంతర్జాతీయ క్రికెట్‌లో నాకు చాలా సహాయపడుతున్నాయి" అని అన్నాడు.

India vs Bangladesh: 3వ టీ20లో చెత్త రికార్డు నమోదు చేసిన రోహిత్ శర్మIndia vs Bangladesh: 3వ టీ20లో చెత్త రికార్డు నమోదు చేసిన రోహిత్ శర్మ

"ఒక మ్యాచ్‌లో నేను బౌలింగ్ చేయాల్సిన బ్యాట్స్‌మెన్‌లకు సంబంధించిన వీడియోలను చూడటం నాకు అలవాటు. ఇదే నా బౌలింగ్‌ సామర్థ్యాన్ని మరోస్థాయికి తీసుకెళ్లింది. కష్టానికి తగిన ఫలితం వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది" అని చాహర్‌ అన్నాడు.

రెండేళ్లకు పైగా ధోనీ నాయకత్వంలో ఆడుతున్నా

రెండేళ్లకు పైగా ధోనీ నాయకత్వంలో ఆడుతున్నా

"రెండేళ్లకు పైగా ధోనీ నాయకత్వంలో ఆడుతున్నా. మైదానంలో నన్ను తిట్టడంతో పాటు సూచనలిచ్చేవాడు. ఈ సంఘటల ద్వారా నేను కొన్ని విషయాలు నేర్చుకున్నా. వికెట్ల వెనక నుంచి మహీభాయ్‌ అన్నింటినీ గమనిస్తాడు. కొన్నిసార్లు బంతివేసే ముందు ఆయనిచ్చిన సలహాలు పాటించడం వల్ల వికెట్లు దక్కేవి" అని చాహల్ అన్నాడు.

డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం అంత సులభం కాదు

డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం అంత సులభం కాదు

"డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం అంత సులభం కాదు. ధోని భాయ్ నుండి నేను నేర్చుకున్న ప్రతి విషయం అంతర్జాతీయ స్థాయిలో నాకు చాలా సహాయపడతాయి. నవ్వుతూ ధోనితో నిత్యం టచ్‌లోనే ఉంటా. పబ్‌జీ గేమ్ ఆడుతున్న సమయంలో ధోనితో మాట్లాడుతూ" అని దీపక్‌ చాహర్‌ తెలిపాడు.

మూడో టీ20లో హ్యాట్రిక్ సాధించిన దీపక్ చాహర్

మూడో టీ20లో హ్యాట్రిక్ సాధించిన దీపక్ చాహర్

నాగ్‌పూర్ వేదికగా గత ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో దీపక్ చాహర్ హ్యాట్రిక్ సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా భారత్‌ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో 'హ్యాట్రిక్‌' తీసిన తొలి బౌలర్‌గా దీపక్‌ చహర్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. అయితే మొత్తంగా ఈ ఘనత సాధించిన 11వ బౌలర్‌ దీపక్‌.

మూడు రోజుల వ్యవధిలో రెండో హ్యాట్రిక్‌

మూడు రోజుల వ్యవధిలో రెండో హ్యాట్రిక్‌

అయితే, మూడు రోజుల వ్యవధిలోనే దీపక్ చాహర్ రెండో హ్యాట్రిక్‌ను సాధించాడు. మంగళవారం ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో భాగంగా విదర్భతో జరిగిన మ్యాచ్‌లో దీపక్ చాహర్ హ్యాట్రిక్ సాధించాడు. విదర్భతో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌లో 12వ ఓవర్ వేసిన దీపక్ చాహర్ దర్శన్ నల్కండే, శ్రీకాంత్ వాగ్(13), అక్షయ్ వాడ్కర్‌లను వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చడం ద్వారా ఈ ఘనత సాధించాడు.

Story first published: Wednesday, November 13, 2019, 17:40 [IST]
Other articles published on Nov 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X