యో-యోపై దృష్టి సారించిన ఐపీఎల్ ప్రాంఛైజీలు: యో-యో టెస్టు అంటే!

Posted By:
What is Yo-Yo test? Teams asks IPL players to take fitness test

హైదరాబాద్: భారత జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలంటే బీసీసీఐ యో-యో టెస్టును తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ యో-యో టెస్టుని ఐపీఎల్‌లో కూడా తప్పనిసరి చేయాలంటూ కొన్ని ఫ్రాంచైజీలు పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటికే 8 ఫ్రాంచైజీల్లో నాలుగు తమ ఆటగాళ్లకు యో-యో టెస్టు నిర్వహించినట్లు సమాచారం.

ఐపీఎల్‌లోని మొత్తం 8 జట్లలో 4 జట్లు ఇప్పటికే తమ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ పరీక్షించేందుకు యో-యో పరీక్షను నిర్వహించినట్లు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్‌ జట్టు తమ ఆటగాళ్లకు గన్‌సోలిలోని రిలయన్స్‌ కార్పొరేట్‌ పార్క్‌లో ఈ పరీక్షలు నిర్వహించింది. బెంగళూరు, పంజాబ్‌, రాజస్థాన్‌ జట్లు కూడా ఈ పరీక్షలను తప్పనిసరి చేశాయి.

ప్రస్తుతానికి మిగిలిన నాలుగు జట్లు ఇంకా ఈ విధానాన్ని తమ ట్రైనింగ్‌ షెడ్యూల్‌లో చేర్చలేదు. ఐపీఎల్ ప్రారంభమయ్యేందుకు ఇంక కొన్ని రోజులే మిగిలున్న నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు తమ ప్లేయర్స్ కోసం ట్రైనింగ్ సెషన్లు నిర్వహిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ తమ ప్లేయర్స్‌కు ఒక్కో లెవల్ పూర్తి చేయడానికి 14.5 సెకన్లు కేటాయించింది.

యో-యో టెస్టుని తప్పనిసరి చేసిన బీసీసీఐ

యో-యో టెస్టుని తప్పనిసరి చేసిన బీసీసీఐ

ఇక, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చేసరికి వేలంలో కొనుగోలు చేసుకున్న ఆటగాళ్లకు వెంటనే యో-యో టెస్టు నిర్వహించినట్లు ఐపీఎల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ‘యో-యో టెస్టుని బీసీసీఐ తప్పనిసరి చేసింది. దీంతో దీనిని ఐపీఎల్‌లో చేర్చడం మంచి పరిణామమే. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ లెవల్‌ ఏంటో దీని ద్వారా తెలుస్తుంది' అని ఆయన అన్నారు.

ఏప్రిల్ 7న ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభం

ఏప్రిల్ 7న ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభం

దీంతో, మిగిలిన నాలుగు ఫ్రాంచైజీలైన సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, చెన్నై సూపర్‌కింగ్స్ కూడా ఈ యో-యో టెస్టుని నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నాయి. ఐపీఎల్‌ 11వ సీజన్‌ ఏప్రిల్ 7న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై రెండేళ్ల పునరాగమనం తర్వాత ఐపీఎల్‌లో అడుగుపెట్టిన చెన్నైతో తలపడనుంది

యో-యో టెస్టు అంటే ఏమిటి?

యో-యో టెస్టు అంటే ఏమిటి?

యో-యో టెస్టులో భాగంగా భాగంగా రెండువైపులా 20 మీటర్ల దూరంలో రెండు లక్ష్యాలను (కోన్స్) ఏర్పాటు చేసి వాటి మధ్య ఆటగాళ్లను పరుగెత్తిస్తారు. బీప్ సౌండ్ వచ్చేలోపు అవతలి లక్ష్యం చుట్టూ తిరిగి రావాల్సి ఉంటుంది. మొదట్లో బీప్ బీప్‌కీ మధ్య కాస్త ఎక్కువ సమయం ఇస్తారు. తర్వాత ఈ సమయాన్ని తగ్గిస్తూ వెళ్తారు.

ఆటగాళ్లు

ఆటగాళ్లు

దానికి అనుగుణంగా తగినట్లు ఆటగాళ్లు తమ వేగాన్ని పెంచాల్సి ఉంటుంది. ఒకవేళ ఆటగాళ్లు ఆ స్పీడ్‌ను అందుకోలేకపోతున్నారని అనిపిస్తే టెస్టును మధ్యలోనే ఆపేస్తారు. ఇదంతా కంప్యూటర్ ఆధారిత ప్రోగ్రామ్ ద్వారానే నిర్వహించి పాయింట్లు నమోదు చేశారు. ఆయా పాయింట్ల ఆధారంగా ఆటగాళ్లు ఫిట్‌గా ఉన్నారా లేదా అని నిర్ణయిస్తారు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Monday, April 2, 2018, 15:48 [IST]
Other articles published on Apr 2, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి