న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీసేనకు వైట్‌వాష్ తప్పదు: వాండరర్స్ పిచ్ పేస్‌కు స్వర్గధామం

By Nageshwara Rao
 We want to get a whitewash against India: Kagiso Rabada

హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సిరిస్‌లో మరో టెస్టు మిగిలుండగానే కోహ్లీసేన 0-2తో సిరిస్‌ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు జోహెన్స్ బర్గ్ వేదికగా జనవరి 24న ప్రారంభం కానుంది.

27 లక్షలు కడితేనే: క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ వింత సమస్య27 లక్షలు కడితేనే: క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ వింత సమస్య

చివరి టెస్టులోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని కోహ్లీసేన భావిస్తుండగా... సఫారీలు మాత్రం వైట్ వాష్‌పై కన్నేశారు. ఇదే విషయాన్ని ఆ దేశ పాస్ట్ బౌలర్ కగిసో రబడ వెల్లడించాడు. మూడో టెస్టు నేపథ్యంలో శుక్రవారం రబడ మీడియాతో మాట్లాడుతూ భారత్‌ను 3-0తో వైట్‌వాష్‌ చేయడమే తమ లక్ష్యమని అన్నాడు.

'ఫాస్ట్ బౌలింగ్‌లో ఎలా ఆడాలో మాకు తెలుసు. ఏ మ్యాచ్‌లోనైనా గెలుపే ప్రధానం. అందుకే భారత్‌తో చివరి టెస్టులోనూ గెలిచి వైట్‌వాష్‌ చేయాలనుకుంటున్నాం. అదే జరుగుతుందని కూడా అనుకుంటున్నా. టీమిండియాలో క్వాలిటీ ప్లేయర్లు లేరని నేను అనడం లేదు. మా జట్టు ఒకరిద్దరు ఆటగాళ్లపై ఆధారపడినట్లే టీమిండియా కోహ్లీపైనే ఆధారపడుతుంది' అని అన్నాడు.

'అలా అని భారత జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు లేరని కాదు. కానీ అందరికంటే విరాట్‌ కోహ్లీ ఎక్కువ పరుగులు చేస్తాడనేది వాస్తవం. అతడి లాంటి బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్‌ చేయడాన్ని ఆస్వాదిస్తున్నా. కోహ్లీ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని కూడా గెలుచుకున్నాడు' అని రబడ చెప్పుకొచ్చాడు.

'మూడో టెస్టు మ్యాచ్ జరిగే వాండరర్స్ పిచ్‌పై ఫాస్ట్ బౌలర్లు బౌలింగ్ చేసేందుకు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. ఎందుకంటే ఆ పిచ్ పేస్‌, బౌన్స్‌, స్వింగ్‌కు స్వర్గధామం కాబట్టి. బుమ్రా మంచి బౌలర్. వన్డేల్లో మంచి ప్రదర్శన చేశాడు. ప్రస్తుతం జరిగే టెస్టు సిరిస్‌లో కూడా బాగా బౌలింగ్ చేస్తున్నాడు' అని ప్రశంసించాడు.

'ఇక షమీ విషయానికి వస్తే అనుభవం కలిగిన బౌలర్. కేప్‌టౌన్‌లో ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్‌లు తమ బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టారు. వీరిద్దరూ అత్యుత్తమ ఫాస్ట బౌలర్లు. ఇక మూడో టెస్టు మ్యాచ్ జరిగే వాండరర్స్ స్టేడియం పిచ్‌ను ఇంకా పరిశీలించలేదు. ఈ సిరీస్‌కు భారత్‌ సన్నాహకం ఎలా ఉందన్నది మాకు ముఖ్యం కాదు.. ఆ జట్టును ఓడించడమే ప్రధానం' అని రబడ చెప్పాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, January 20, 2018, 11:46 [IST]
Other articles published on Jan 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X