న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Team India: ‘చోకర్స్’ అని పిలవచ్చు.. టీమిండియాపై మాజీ లెజెండ్ అక్కసు

we can now call team india chokers says former legend

భారత జట్టు మరోసారి ఐసీసీ టోర్నమెంట్లో బొక్కబోర్లా పడింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో రాణించిన టీమిండియా.. ప్రపంచకప్ సెమీస్‌లో పేలవమైన ఆటతీరుతో ఓటమి పాలైంది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ ఇద్దరే ఛేదించేశారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలతో అదరగొట్టి తమ జట్టుకు విజయాన్నందించారు.
ఒత్తిడికి తలొగ్గిన జట్టు

ఒత్తిడికి తలొగ్గిన జట్టు

సెమీఫైనల్ మ్యాచులో భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ కేఎల్ రాహుల్ విఫలమవగా.. రోహిత్ శర్మ కూడా సరిగా ఆడలేదు. కాసేపటికే స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా పెవిలియన్ చేరడంతో భారత్‌పై తీవ్రమైన ఒత్తిడి పడింది. ఈ క్రమంలో కోహ్లీ, పాండ్యా జట్టును ఆదుకున్నారు. కానీ ఓపెనర్లు పేలవంగా ఆడటం, తక్కువ స్కోరుకే వికెట్లు కోల్పోవడంతో తర్వాతి బ్యాటర్లు జాగ్రత్తగా ఆడటంతో భారత జట్టు ఆశించిన స్కోరు చెయ్యలేకపోయింది. ఇంగ్లండ్ బ్యాటర్లు ఎదురు దాడికి దిగడంతో బౌలర్లు కూడా ఒత్తిడికి లోనై చేతులెత్తేశారు.

‘చోకర్స్' అని పిలవచ్చు..

‘చోకర్స్' అని పిలవచ్చు..

ఈ ఓటమిపై భారత మాజీలు స్పందించారు. టీమిండియాకు తొలి ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్.. భారత జట్టు 'చోకర్స్' అంటూ విమర్శించాడు. 'భారత జట్టు సెమీస్‌లో ఒత్తిడిని జయించలేకపోయింది. వాళ్లను కావాలంటే చోకర్స్ అని పిలవచ్చు. దాంట్లో తప్పేం లేదు' అని కపిల్ అన్నాడు. అదే సమయంలో కేవలం ఒక్క ఓటమితో జట్టుపై విమర్శలు గుప్పించాల్సిన అవసరం లేదన్నాడు.

పిచ్‌ను ఇంగ్లండ్ అర్థం చేసుకుంది

పిచ్‌ను ఇంగ్లండ్ అర్థం చేసుకుంది

మ్యాచ్ జరిగిన అడిలైడ్ ఓవల్ పిచ్‌ను ఇంగ్లండ్ బ్యాటర్లు చక్కగా అర్థం చేసుకున్నారని కపిల్ తెలిపాడు. 'వాళ్లు పిచ్‌ను అర్థం చేసుకున్నారు. మంచి క్రికెట్ ఆడారు. భారత్ చేసిన స్కోరు తక్కువేం కాదు. కానీ పిచ్‌కు తగ్గట్లు బౌలింగ్ చెయ్యకపోతే ఫలితం ఇలాగే ఉంటుంది. ఒక్కసారి వాళ్లు ఎన్ని షార్ట్ బాల్స్ వేశారో చూడండి' అని కపిల్ దేవ్ అన్నాడు.

Story first published: Friday, November 11, 2022, 12:18 [IST]
Other articles published on Nov 11, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X