న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఊహించని విజయం: డ్రెస్సింగ్ రూమ్‌లో కివీస్ ఆటగాళ్ల భాంగ్రా డ్యాన్స్ (వీడియో)

Watch: New Zealand Cricketers Celebrate Dramatic Win Over Pakistan With Bhangra In Dressing Room

హైదరాబాద్: అబుదాబి వేదికగా తొలి టెస్టు. అప్పటి వరకూ పాకిస్థాన్‌ జట్టు విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. అయితే, చివరి నిమిషంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన తొలి టెస్టులో పాకిస్థాన్ జట్టు అనూహ్యంగా నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది.

మూడు టెస్టుల మ్యాచ్‌ల సిరీస్‌‌లో

మూడు టెస్టుల మ్యాచ్‌ల సిరీస్‌‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 176 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు 171 పరుగులకు ఆలౌటైంది. దీంతో న్యూజిలాండ్‌ జట్టు నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌కి వెళ్లిన కివీస్‌ జట్టు సంబరాల్లో మునిగిపోయింది.

 'భాంగ్రా' డ్యాన్స్‌ వేస్తూ సంబరాలు

'భాంగ్రా' డ్యాన్స్‌ వేస్తూ సంబరాలు

'భాంగ్రా' డ్యాన్స్‌ వేస్తూ సంబరాలు జరుపుకొన్నారు. ఈ స్టెప్పులు చూసిన‌ స‌హ‌చ‌ర ఆట‌గాళ్లు ప‌డిప‌డి న‌వ్వారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శనివారం నుంచి దుబాయ్‌ వేదికగా రెండో టెస్టు జరగనుంది. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య డిసెంబరు 3న మూడో టెస్టు జరగనుంది.

 న్యూజిలాండ్‌కు ఇది ఐదోసారి కావడం విశేషం

న్యూజిలాండ్‌కు ఇది ఐదోసారి కావడం విశేషం

కాగా, టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యల్ప తేడాతో గెలువడం న్యూజిలాండ్‌కు ఇది ఐదోసారి కావడం విశేషం. న్యూజిలాండ్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యం కోసం 37/0 ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను ఆరంభించిన పాక్‌ను కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ కుప్పకూల్చాడు. ఈ మ్యాచ్‌లో అజాజ్ పటేల్ 5 వికెట్లు తీసి 59 పరుగులు సమర్పించుకున్నాడు.

 విజయానికి 29 పరుగులు, చేతిలో 6 వికెట్లు

విజయానికి 29 పరుగులు, చేతిలో 6 వికెట్లు

పాక్ విజయానికి 29 పరుగులు కావాల్సిన సమయంలో చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. దీంతో పాక్‌ సునాయాసంగా గెలుస్తుందని భావించారు. కానీ ఆ జట్టు అనూహ్యంగా 24 పరుగులు చేసి ఆలౌటైంది. పాక్ బ్యాట్స్‌మన్‌లలో అజర్ అలీ(65) హాఫ్ సెంచరీతో రాణించగా మిగతావారంతా ఘోరంగా విఫలమయ్యారు. కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

Story first published: Tuesday, November 20, 2018, 14:37 [IST]
Other articles published on Nov 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X