న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Watch: 'బేబీ షార్క్' జీవాతో పూల్‌లో ధోని: పక్కనే హార్దిక్ పాండ్యా

MS Dhoni And Daughter Ziva Enjoy Pool Time With Hardik Pandya
Watch: MS Dhoni and Baby shark Ziva enjoy pool time with Hardik Pandya

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌కు రెండు నెలలు విరామం తీసుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం తన కుటుంబంతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నాడు. కుమార్తె జీవాతో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ధోని జలకాలాడుతూ సందడి చేశాడు. పూల్‌లో జీవాతో పాటు ధోని పక్కన టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా కూడా ఉన్నాడు.

ఇందుకు సంబంధించిన ఫోటోలను ధోని తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. ఇందులో జీవా కలర్‌పుల్ స్విమ్మింగ్ కాస్ట్యూమ్‌ను ధరించింది. ఈ క్రమంలో జీవాకు ధోని స్విమ్మింగ్ ఎలా చేయాలో నేర్పుతుంటే సంతోషంగా కనిపించింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

జోయా ఫాక్టర్ ట్రైలర్‌.. సోనమ్ కపూర్‌ను ప్రశంసించిన సచిన్జోయా ఫాక్టర్ ట్రైలర్‌.. సోనమ్ కపూర్‌ను ప్రశంసించిన సచిన్

సందిగ్ధంలో ధోని క్రికెట్ భవిష్యత్తు

సందిగ్ధంలో ధోని క్రికెట్ భవిష్యత్తు

ఇదిలా ఉంటే, ధోని క్రికెట్ భవిష్యత్తు ప్రస్తుతం సందిగ్ధంలో ఉంది. సెప్టెంబర్ 15 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ధోనీని సెలక్టర్లు ఎంపిక చేయని సంగతి తెలిసిందే. జట్టును ప్రకటించిన ఆంతరం జరిగే మీడియా సమావేశంలో బీసీసీఐ అధికారులు ధోనీ విషయమై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.

సెలక్టర్లు ధోనీని కావాలనే

సెలక్టర్లు ధోనీని కావాలనే

దీంతో సెలక్టర్లు ధోనీని కావాలనే జట్టులోకి తీసుకోలేదనే పుకార్లు మొదలయ్యాయి. కాగా, అవన్నీ అవాస్తవాలేనని సెలక్షన్‌ కమిటీలోని సభ్యుడొకరు తెలిపారు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తోన్న 2020 టీ20 వరల్డ్‌కప్‌కు జట్టును నిర్మించుకొనేందుకు, ప్రణాళికలు సిద్ధం చేయడానికి ధోనియే తమకు సమయం ఇచ్చాడని తెలిపారు.

ధోనీని విస్మరించే ప్రశ్న లేదు

ధోనీని విస్మరించే ప్రశ్న లేదు

"ధోనీని విస్మరించే ప్రశ్న లేదు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌నకు ప్రణాళికలు సిద్ధం చేసుకొనేందుకు, పటిష్టమైన జట్టును రూపొందించేందుకు నిజానికి ధోనియే మాకు సమయమిచ్చాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రిషభ్‌ పంత్‌ గాయపడితే అతడి స్థానం భర్తీచేసే మరొక ఆటగాడు లేడని ధోనీ సైతం భావిస్తున్నాడు" అని ఆ సెలక్టర్‌ చెప్పుకొచ్చాడు.

ధోని స్వతహాగానే

ధోని స్వతహాగానే

అయితే, ఈ పర్యటన నుంచి ధోని స్వతహాగా తప్పుకున్నాడు. సెప్టెంబర్ 15 నుంచి జరగనున్న తొలి టీ20లో భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికాతో టీమిండియా మూడు టీ20లు, మూడు టెస్టులు ఆడనుంది. ధర్మశాల వేదికగా సెప్టెంబర్‌ 15న తొలి టీ20 ప్రారంభం కానుంది.

Story first published: Thursday, September 12, 2019, 11:20 [IST]
Other articles published on Sep 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X