న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన బుమ్రా బుల్లెట్ రనౌట్ (వీడియో)

Watch: Jasprit Bumrahs bullet run-out to dismiss Keemo Paul is going viral on internet

హైదరాబాద్: ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పేస్ బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా అద్భుతమైన ఫీల్డింగ్‌తో క్రికెట్ అభిమానులను అవాక్కయ్యేలా చేశాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా బుల్లెట్ మాదిరి త్రో విసిరి ఢిల్లీ ఆటగాడు కీమో పాల్‌ను రనౌట్ చేశాడు. ఢిల్లీ ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

బుమ్రా వేసిన తొలి బంతిని ఎక్స్‌ట్రా కవర్ మీదుగా అక్సర్‌ పటేల్‌ ఢిఫెన్స్‌ ఆడి పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే, ఆ బంతిని మిడ్ ఫీల్డ్‌లో బుమ్రా అందుకోవడంతో పరుగు విరమించుకుని నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న కీమో పాల్‌ను వెనక్కి వెళ్లమని సూచించాడు. అయితే, అప్పటికే కీమో పాల్‌ సగం పిచ్‌‌ని దాటేశాడు.

ఈ క్రమంలో బంతిని అందుకున్న బుమ్రా నేరుగా వికెట్లను గిరాటేయడంతో రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌లో కీమా పాల్ ఒక్క బంతి కూడా ఆడకపోవడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియోని ఐపీఎల్ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబై 40 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అనంతరం 169 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 128 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు పృథ్వీ షా(20), శిఖర్ ధావన్(35) పరుగులతో శుభారంభాన్నిచ్చారు.

వీరిద్దరూ తొలి వికెట్‌కు 49 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత శిఖర్ ధావన్ తొలి వికెట్‌గా ఔటయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మిగతా బ్యాట్స్‌మన్ మున్రో(3), అయ్యర్(3), పంత్(7) స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌కు చేరడంతో ఢిల్లీ 76 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. చివర్లో ఆక్సర్ పటేల్ 23 బంతుల్లో 26 (ఫోర్, సిక్స్), మోరిస్ (11) పరుగులతో రాణించడంతో ఆ మాత్రం స్కోరన్నా చేయగలిగింది.

Story first published: Friday, April 19, 2019, 15:04 [IST]
Other articles published on Apr 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X