న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండో టీ20: బుమ్రాను బోల్తా కొట్టించేందుకు పొలార్డ్ అతి తెలివి (వీడియో)

India vs West Indies 2nd T20I : Bumrah-Pollard Fight, Video Viral | Oneindia Telugu
WATCH: Jasprit Bumrah Left Furious After Kieron Pollard Tries To Distract While Taking A Catch

హైదరాబాద్: భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య లక్నో వేదికగా జరిగిన రెండో టీ20లో విండీస్‌ ఇన్నింగ్స్‌ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. టీమిండియా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ బస్ప్రీత్ బుమ్రా వేసిన 11 ఓవర్‌లో విండీస్‌ హిట్టర్ కీరన్‌ పొలార్డ్‌ తన అతి తెలివిని ప్రదర్శించాడు.

 పొలార్డ్‌ వైపు కోపంగా చూసిన బుమ్రా

పొలార్డ్‌ వైపు కోపంగా చూసిన బుమ్రా

బుమ్రా వేసిన నాలుగో బంతిని పొలార్డ్‌ షాట్‌ ఆడే ప్రయత్నం చేయగా.. అది బ్యాట్‌ అంచుకు తగిలి అక్కడే గాల్లోకి లేచింది. ఈ క్యాచ్‌ అందుకోవడానికి బుమ్రా వెళ్లగా పొలార్డ్‌ అతని దృష్టిని మరల్చేందుకు గాను చేయిని పైకిలేపాడు. అయినా సరే, క్యాచ్‌ అందుకున్న బుమ్రా పొలార్డ్‌ వైపు కోపంగా చూశాడు.

నవ్వుకుంటూ పెవిలియన్‌కు చేరిన పొలార్డ్

దీంతో పొలార్డ్ నవ్వుకుంటూ పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో బుమ్రా, పొలార్డ్‌లు ముంబై ఇండియన్స్‌కు ఆడుతోన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది.

2-0తో సిరిస్ కైవసం చేసుకున్న టీమిండియా

2-0తో సిరిస్ కైవసం చేసుకున్న టీమిండియా

దీంతో మూడు టీ20ల సిరిస్‌ను టీమిండియా 2-0తో సొంతం చేసుకుంది. దీంతో నెల రోజుల సుదీర్ఘ పర్యటనకు భారత పర్యటనకు వచ్చిన వెస్టిండీస్ జట్టు రిక్తహస్తంతో స్వదేశానికి తిరిగి వెళ్లనుంది. ఇప్పటికే భారత్‌పై టెస్టు, వన్డే సిరీస్‌లను కోల్పోయిన సంగతి తెలిసిందే. తొలి టీ20లో పోరాట పటిమను చూపించిన విండిస్, రెండో మ్యాచ్‌లో దారుణంగా ఓడిపోయింది.

71 పరుగుల తేడాతో భారత్ విజయం

71 పరుగుల తేడాతో భారత్ విజయం

కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో పాటు బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయడంతో రెండో టీ20లో భారత్ 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఇంకో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. భారత్‌కు ఇది వరసగా ఏడో సిరీస్ విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.

Story first published: Thursday, November 8, 2018, 10:40 [IST]
Other articles published on Nov 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X