
45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద
ఈ ఇన్నింగ్స్‌లో 45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటైన చతేశ్వర్ పుజారాకి.. అంతక ముందు ఫీల్డ్ అంపైర్ తప్పిదం కారణంగా లైఫ్ లభించింది. బంతి పుజారా బ్యాట్ ఎడ్జ్ తాకి నేరుగా వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లగా.. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. పుజారా కూడా తనకు ఏమీ తెలియదు అన్నట్టు మిన్నకుండిపోయాడు.
|
పుజారా డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్తోన్న సమయంలో
దీంతో ఆదివారం ఆట ముగిసిన తర్వాత పుజారా డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్తున్న సమయంలో ‘ఛీటర్.. ఛీటర్' అంటూ స్టేడియంలోని అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

పుజారా సెంచరీ: రంజీ ఫైనల్లోకి సౌరాష్ట్ర
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో పుజారా 266 బంతుల్లో 17 ఫోర్ల సాయంతో 131 నాటౌట్‌గా నిలవడంతో సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ ఫైనల్‌కు చేరింది. కర్ణాటకతో జరిగిన రెండో సెమీ ఫైనల్లో సౌరాష్ట్ర ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పుజారా(131 నాటౌట్) సెంచరీకి తోడు షెల్డాన్ జాక్సన్(100) కూడా సెంచరీతో రాణించడంతో సౌరాష్ట్ర అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

విదర్భతో ఫైనల్ మ్యాచ్
224/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఆటను కొనసాగించిన సౌరాష్ట్ర మరో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా రంజీ ట్రోఫీలో మూడోసారి ఫైనల్‌కు చేరింది. డిఫెండింగ్ చాంపియన్ విదర్భతో తలపడనుంది. ఫిబ‍్రవరి 3వ తేదీ నుంచి నాగ్‌పూర్‌లో ఇరు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.