న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పుట్టినరోజు నాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ను సర్‌ప్రైజ్‌ చేసిన సతీమణి

VVS Laxman thanks Indian cricket team for joining his birthday celebrations

హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం, హైదరాబాదీ సొగసరి బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ను ఆయన సతీమణి శైలజ సర్‌ప్రైజ్‌ చేశారు. నవంబర్‌ 1 లక్ష్మణ్‌ పుట్టిన రోజు. లక్ష్మణ్‌ పుట్టిన రోజు సందర్భంగా భారత క్రికెటర్లతో కలిసి పార్టీ ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ విషయాన్ని లక్ష్మణ్ స్వయంగా తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నారు.

9 వికెట్ల తేడాతో భారత్ విజయం

9 వికెట్ల తేడాతో భారత్ విజయం

వివరాల్లోకి వెళితే.. నవంబర్ 1న తిరువనంతపురం వేదికగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ జట్టు 104 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన టీమిండియా 14.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

లక్ష్మణ్ పుట్టినరోజు వేడుకలకు టీమిండియా

మ్యాచ్‌ ముగిసిన తర్వాత శైలజ‌ టీమిండియా సభ్యుల్ని లక్ష్మణ్ పుట్టినరోజు వేడుకలకు ఆహ్వానించారు. ఈ విషయం తెలియని లక్ష్మణ్ ఎంతో ఆశ్చర్యపోయారు. తనకు అనుకోని సర్‌ప్రైజ్ ‌ఇచ్చిన శైలజకు, కోహ్లీసేనకు కృతజ్ఞతలు తెలుపుతూ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. "మాతో సమయం గడిపి, ఈ వేడుకలో పాల్గొన్న టీమిండియాకు కృతజ్ఞతలు. నా సతీమణి శైలజ నన్ను చాలా సర్‌ప్రైజ్‌ చేసింది" అని లక్ష్మణ్ ట్వీట్ చేశాడు.

లక్ష్మణ్ పుట్టినరోజు వేడుకల్లో ధోని, పంత్, ధావన్

లక్ష్మణ్ పుట్టినరోజు వేడుకల్లో ధోనీ, రిషబ్‌ పంత్‌, శిఖర్ ధావన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, యుజువేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, కేదార్‌ జాదవ్‌, లక్ష్మణ్ భార్య శైలజ, పిల్లలు ఉన్నారు. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ని భారత్ జట్టు 3-1తో సొంతం చేసుకుంది. ఐదు వన్డేల సిరిస్‌లో కెప్టెన్ కోహ్లీ వరుసగా మూడు సెంచరీలు సాధించాడు.

ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం తొలి టీ20

ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం తొలి టీ20

అంతేకాదు మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డునిసైతం అందుకున్నాడు. ఆఖరి వన్డేలో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించడంతో అనేక రికార్డులను సైతం నమోదు చేశాడు. భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య ఐదు వన్డేల సిరిస్ ముగిసిన తర్వాత మూడు టీ20ల సిరిస్ ప్రారంభం కానుంది. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం జరగనుంది.

Story first published: Saturday, November 3, 2018, 10:25 [IST]
Other articles published on Nov 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X