న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాకు నాలుగో టెస్టు 'డూ ఆర్ డై' లాంటిది: సెహ్వాగ్

Virender Sehwag thinks the 4th Test is a ‘do or die clash’ for Team India

నాటింగ్‌హామ్: ఇంగ్లాండ్ పర్యటనకు బయల్దేరిన టీమిండియా ఆఖరి సిరీస్ టెస్టు ఫార్మాట్‌లో విజయం సాధించాలని ఆరాటపడింది. ఈ క్రమంలోనే తొలి టెస్టులో పోరాడి కేవలం 31పరుగుల తేడాతో విజయాన్ని కోల్పోయింది. ఆ పరాభవంతో రెండో టెస్టులో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక కచ్చితంగా గెలవాల్సిన మూడో టెస్టులో విజయం సాధించాల్సిందేనని విమర్శకులు, సీనియర్లు తేల్చి చెప్పేశారు.

ఓ వైపు కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్‌లు వెన్నునొప్పి బాధిస్తున్నా.. మూడో టెస్టుకు కోలుకుని అద్భుతంగా రాణించారు. దీంతో 200కు పైగా ఆధిక్యంతో టీమిండియా విజయాన్ని అందుకుంది. ఇక నాలుగో టెస్టు గెలిస్తే 2-2 సాధించేసినట్లే. ఆ తర్వాత ఐదో టెస్టు గెలిస్తే విజయం లేదా 'డ్రా'గానే మిగిలిపోతుంది. అంతేకానీ, పరాజయం ఉండదు. ఈ నేపథ్యంలో టీమిండియాకు నాలుగో టెస్టు డూ ఆర్ డై లాంటిదని పేర్కొన్నాడు.

1
42377

ఈ మ్యాచ్ గెలిచి 80ఏళ్ల నాటి చరిత్ర తిరగరాయాలని పిలుపునిచ్చాడు. 'అసాధ్యం కానిదంటూ ఏదీ లేదు. టీమిండియా నాలుగో టెస్టులో కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియంలో ఆడినతీరును కొనసాగిస్తే విజయం తప్పక వరిస్తుంది. ఈ రెండు పరాజయాల తర్వాత టీమిండియా బాగానే పుంజుకుంది. ఇంగ్లాండ్ కూడా అదే స్థాయిలో రాణించేందుకు ప్రయత్నించవచ్చు'

దాంతో పాటు మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ మొదటి టెస్టులో 149, 51 పరుగులు చేసి టెస్టు క్రికెట్‌లో మొదటి ర్యాంకు పొందాడు. ఆ ర్యాంకును రెండో టెస్టులో కోల్పోయినా తిరిగి మూడో టెస్టుకు రెండు ఇన్నింగ్స్ కలిపి 200పరుగులు సంపాదించుకున్నాడు. స్టీవ్ స్మిత్ స్థానాన్ని కొట్టేసిన కోహ్లీ టాప్ 1 టెస్టు బ్యాట్స్‌మెన్‌గా ఎదిగాడు. ఇది మామూలు విషయం కాదు. అయినా అతనిపై ర్యాంకుల ప్రభావం కనిపించదనుకుంటాను. అతని లక్ష్యం ఇంకా పెద్దదిగా ఉండుంటుంది. ఎలాగంటే టెండూల్కర్ 100 సెంచరీలు చేసినట్లుగా కోహ్లీ కూడా భారత విజయాలకు తన సెంచరీలు కారణాలు కావాలని కోరుకుంటున్నాడేమో' అని అభివర్ణించాడు.

Story first published: Friday, August 24, 2018, 12:58 [IST]
Other articles published on Aug 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X