న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీలో ఉన్న ఆ టాలెంట్ రోహిత్‌లో లేదు: గంభీర్

Virat Kohli vs Rohit Sharma: Gautam Gambhir explains why Indian skipper is more consistent that Hitman

ఢిల్లీ: టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కంటే కెప్టెన్ విరాట్ కోహ్లీనే బెస్ట్ బ్యాట్స్‌మెన్ అని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. స్పిన్ బౌలింగ్‌లో కోహ్లీ ప్రతి బంతికీ స్ట్రైక్ రొటేట్ చేయగలడు, కానీ రోహిత్‌లో ఆ టాలెంట్ లేదన్నాడు. కోహ్లీ, రోహిత్‌లలో బెస్ట్ వన్డే బ్యాట్స్‌మెన్ ఎవరంటే గత ఏడాదికాలంగా ఎక్కువ ఓట్లు హిట్‌మ్యాన్‌కే పడ్డాయి. ఎందుకంటే.. రోహిత్ గతేడాది ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఇక 2019 వన్డే ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు బాది పరుగుల వరద పారించాడు.

ఆ టాలెంట్ రోహిత్‌లో లేదు

ఆ టాలెంట్ రోహిత్‌లో లేదు

స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్‌లో మాజీ భారత ఓపెనర్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ... 'స్పిన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ ప్రతి బంతికీ స్ట్రైక్ రొటేట్ చేస్తాడు. కానీ రోహిత్ శర్మలో ఆ టాలెంట్ లేదు. అయితే రోహిత్ శర్మ భారీ షాట్లు ఆడగలడు. మ్యాచ్‌లలో హిట్టింగ్ కంటే.. స్ట్రైక్ రొటేట్ చేయగలిగిన బ్యాట్స్‌మెనే నిలకడగా రాణించగలడు. రోహిత్ శర్మకే కాదు.. క్రిస్ ‌గేల్, ఏబీ డివిలియర్స్ లాంటి వారికి స్పిన్‌లో స్ట్రైక్ రొటేట్ చేసే సామర్థ్యం లేదు' అని గౌతమ్ గంభీర్ వెల్లడించాడు.

మైండ్ సెట్ మార్చుకుంటే సరిపోతుంది

మైండ్ సెట్ మార్చుకుంటే సరిపోతుంది

'విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్‌లలో గొప్ప బ్యాట్స్‌మన్‌. వన్డే, టీ20లలో మాత్రమే కాదు టెస్ట్ ఫార్మాట్‌లో కూడా ఆధిపత్యం చెలాయించాడు. కాబట్టి భారత కెప్టెన్ తన ఆటలో ఏమీ మార్చుకోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నా. ఫార్మాట్‌ను బట్టి మైండ్ సెట్ మార్చుకుంటే సరిపోతుంది. అయితే టెక్నిక్ మాత్రం అలానే ఉండాలి. ఎందుకంటే కవర్ డ్రైవ్ ఏ ఫార్మాట్‌లో అయినా ఒకేవిధంగా ఉంటుంది' అని గంభీర్ చెప్పాడు. గంభీర్, కోహ్లీ కలిసి చాలా మంచి భాగస్వామ్యాలు నెలకొల్పిన విషయం తెలిసిందే. ముఖ్యంగా 2011 ప్రపంచకప్‌ ఫైనల్లో.

 సింగిల్స్ రాబట్టడంలో సిద్ధహస్తుడు

సింగిల్స్ రాబట్టడంలో సిద్ధహస్తుడు

భారత్ తరఫున దాదాపు 13 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన గౌతమ్ గంభీర్.. హిట్టింగ్‌తో పాటు సునాయాసంగా స్ట్రైయిక్‌ని రొటేట్ చేయగలిగాడు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌లో బ్యాక్‌ఫుట్ వెళ్లి మరీ బంతిని ఫీల్డర్ల మధ్యలోకి నెట్టడం గంభీర్ స్టయిల్. ఒకవైపు వీరేందర్ సెహ్వాగ్ రెచ్చిపోతుంటే.. మరోవైపు గౌతీ మాత్రం అతనికి అండగా నిలిచేవాడు. ఇక విరాట్ కోహ్లీ కూడా ఫీల్డర్ల మధ్యలోకి బంతిని నెట్టి సింగిల్స్ రాబట్టడంలో సిద్ధహస్తుడు. వికెట్లు చేజారుతున్న సమయంలో భాగస్వామ్యాలు నిర్మిస్తూ.. ప్రత్యర్థి బౌలర్, ఫీల్డర్లపై ఒత్తిడి పెంచాలంటే స్ట్రైయిక్ రొటేషన్ ఒక్కటే మార్గం. కోహ్లీ కూడా ఇదే చేస్తాడు.

ఐసీసీ ట్రోఫీలు సాధిస్తేనే గొప్ప

ఐసీసీ ట్రోఫీలు సాధిస్తేనే గొప్ప

బ్యాట్స్‌మన్‌గా విరాట్‌ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేస్తున్నా.. కెప్టెన్‌గా మాత్రం ఇంకా ఏం సాధించలేదని‌ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. ఐసీసీ ట్రోఫీలు సాధించే వరకు విరాట్‌ను విజయవంతమైన సారథిగా పరిగణించలేమన్నాడు. 'నిజం చెప్పాలంటే భారత జట్టు కెప్టెన్‌గా కోహ్లీ గొప్ప విజయాలేమీ సాధించలేదు. బ్యాట్స్‌మన్‌గా భారీగా పరుగులు చేస్తున్నాడు. మిగతా వారిలో అతను ప్రత్యేకం. కెప్టెన్‌గా జట్టులోని ఆటగాళ్ల ప్రతిభను అతను బయటకి తీయాలి. తన సామర్థ్యంతో వారిని పోల్చకూడదు. ఎవరికి వారే ప్రత్యేకం కాబట్టి వారిలో అత్యుత్తమ ఆట బయటకు వచ్చేలా కోహ్లీ ప్రోత్సహించాలి. ప్రపంచకప్ లాంటి మెగా టైటిళ్లు గెలిస్తేనే గొప్ప. లేకుంటే కెరీర్‌లో అదో లోటుగా మిగిలిపోతుంది' అని గంభీర్‌ గుర్తు చేశాడు.

భారత ఆటగాళ్లు ఐదు క్యాచ్‌లు వదిలేస్తే సెంచరీ చేశా: స్మిత్‌

Story first published: Tuesday, June 16, 2020, 13:36 [IST]
Other articles published on Jun 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X