న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజున: వన్డేల్లో తొలి సెంచరీని రుచి చూసిన విరాట్ కోహ్లీ

Virat Kohli scored his 1st ODI hundred exactly 10 years ago on this day

హైదరాబాద్: డిసెంబర్ 24.... టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జీవితంలో ఈరోజుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే సరిగ్గా పదేళ్ల క్రితం ఇదో రోజున విరాట్ కోహ్లీ వన్డేల్లో తన తొలి సెంచరీని సాధించాడు. డిసెంబర్ 24, 2009న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ(107) పరుగులతో సెంచరీ సాధించాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 315 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్ 118 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 316 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 23 పరుగులకే ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్‌ వికెట్లను కోల్పోయింది.

ఆ 30 నిమిషాలు మినహాయిస్తే.. 2019 టీమిండియాకు ఉత్తమ ఏడాది: కోహ్లీఆ 30 నిమిషాలు మినహాయిస్తే.. 2019 టీమిండియాకు ఉత్తమ ఏడాది: కోహ్లీ

107 పరుగుల వద్ద కోహ్లీ ఔట్

107 పరుగుల వద్ద కోహ్లీ ఔట్

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు 224 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. విరాట్ కోహ్లీ(107) సెంచరీ అనంతరం పెవిలియన్‌కు చేరగా... గౌతమ్ గంభీర్(150) పరుగులు చేయడంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని సాధించింది.

వన్డేల్లో 43 సెంచరీలు

వన్డేల్లో 43 సెంచరీలు

ఇప్పటివరకు వన్డేల్లో విరాట్ కోహ్లీ 43 సెంచరీలు చేశాడు. ఈ ఏడాది వన్డేల్లో కోహ్లీ 1377 పరుగులు చేశాడు. కాగా, మూడు ఫార్మాట్లలో కలిపి 2,455 పరుగులు చేసాడు. దీంతో వరుసగా నాలుగేళ్లు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. 2016లో 2,595 పరుగులు.. 2017లో 2,818 పరుగులు.. 2018లో 2,735 పరుగులు చేశాడు.

వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో

వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో

వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ 11,609 పరుగులతో ఏడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ (18,426), కుమార సంగక్కర (14,234), రికీ పాంటింగ్‌ (13,704), జయసూర్య (13,430), మహేల జయవర్ధనే (12,650), ఇంజమాముల్ హక్‌ (11,739)లు వరుసగా ఉన్నారు.

27 టెస్టు సెంచరీలు

27 టెస్టు సెంచరీలు

ఇక, టెస్టుల విషయానికి వస్తే విరాట్ కోహ్లీ 27 సెంచరీలు చేశాడు. ఈ ఏడాది దక్షిణాఫ్రికాపై మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను టీమిండియా 3-0తో కైవసం చేసుకోవడంతో భారత్ తరుపున అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోని రికార్డుని విరాట్ కోహ్లీ అధిగమించాడు.

Story first published: Tuesday, December 24, 2019, 15:35 [IST]
Other articles published on Dec 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X