న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా ఫోటోషూట్: కొత్త లుక్‌లో కోహ్లీ, రోహిత్ శర్మ... ఫోటోలు వైరల్

Virat Kohli to Rohit Sharma; Twitter goes gaga over Team India snapshots for Australia Tests

హైదరాబాద్: ఆసీస్ గడ్డపై టీమిండియా మరో కఠిన సవాల్‌కు సిద్ధమైంది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌కు టీమిండియా క్రికెటర్లు సమాయత్తమవుతున్నారు. డిసెంబర్ 6న ఇరు జట్ల మధ్య అడిలైడ్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది.

<strong>విజయమే లక్ష్యంగా టీమిండియా: తొలి టెస్టుకు ముందు ఇలా (ఫోటోలు)</strong>విజయమే లక్ష్యంగా టీమిండియా: తొలి టెస్టుకు ముందు ఇలా (ఫోటోలు)

ఈ టెస్టుకు ముందు భారత క్రికెటర్లతో బీసీసీఐ ప్రొఫైల్ ఫోటోషూట్ నిర్వహించింది. ఈ ఫోటోషూట్‌లో పాల్గొన్న భారత క్రికెటర్లకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బీసీసీఐ పోస్టు చేసిన ఫోటోల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీతో పాటు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్‌లు ఉన్నారు. ఈ ఫోటో షూట్‌లో భారత క్రికెటర్లు కొత్త లుక్‌లో అదిరిపోయారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. గురువారం నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది.

నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. తొలి టెస్టుకు ముందు క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డ్ ఎలెవన్ జట్టుతో ఆడిన వార్మప్ మ్యాచ్‌‌లో భారత బ్యాట్స్‌మెన్ పరుగుల వరద పారించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం టీమిండియా టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలొ కొనసాగుతోంది. ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు హాఫ్ సెంచరీలతో అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఇక, బౌలర్ల విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ ఆశించిన స్థాయిలో రాణించారు.

Story first published: Monday, December 3, 2018, 17:40 [IST]
Other articles published on Dec 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X