న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాలుగో స్థానంలో కోహ్లీ!: తెరపైకి కొత్త విషయాన్ని తీసుకొచ్చిన గవాస్కర్

Virat Kohli needs no protection in Indian batting lineup: Sunil Gavaskar

హైదరాబాద్: టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఎలాంటి రక్షణ అవసరం లేదని మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలి? అనే దానిపై గత కొన్ని రోజులుగా మాజీ క్రికెటర్ల మధ్య చర్చ జరుగుతోంది. విరాట్ కోహ్లీని నాలుగో స్థానంలో ఆడిస్తామని.. ఇటీవల టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడగా, కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దింపితే అది తెలివి తక్కువ నిర్ణయమవుతుందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు.

పుల్వామా ఉగ్రదాడి: అవార్డుల కార్యక్రమాన్ని వాయిదా వేసిన కోహ్లీపుల్వామా ఉగ్రదాడి: అవార్డుల కార్యక్రమాన్ని వాయిదా వేసిన కోహ్లీ

కోహ్లీ నాలుగో స్థానంలో.. స్పందించిన గవాస్కర్

కోహ్లీ నాలుగో స్థానంలో.. స్పందించిన గవాస్కర్

తాజాగా దీనిపై మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు. ఫిబ్రవరి 24 నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా రెండు టీ20లు, ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది. వరల్డ్ కప్ ముంగిట టీమిండియాకు ఇదే చివరి సిరిస్ కావడంతో జట్టు మేనేజ్‌మెంట్ ఈ సిరిస్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గవాస్కర్ ఇండియూ టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ "ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా ఉన్న కోహ్లీకి బ్యాటింగ్ ఆర్డర్‌లో రక్షణ ఏమీ అవసరం లేదు" అని చెప్పుకొచ్చాడు.

ఒక్కోసారి స్వింగ్‌కి అతిగా అనుకూలిస్తాయి

ఒక్కోసారి స్వింగ్‌కి అతిగా అనుకూలిస్తాయి

"అయితే, ఇంగ్లాండ్ పిచ్‌లు ఒక్కోసారి స్వింగ్‌కి అతిగా అనుకూలిస్తాయి. అలాంటి సమయాల్లో భారీ లక్ష్యఛేదనకు దిగి.. ఆరంభంలోనే వికెట్ చేజార్చుకుంటే? విరాట్ కోహ్లీ వికెట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత టీమిండియాపై ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కోహ్లీని నెం.3లో కాకుండా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపించాలి" అని గవాస్కర్ సూచించాడు.

ప్రమాదకరంగా పేసర్లు

ప్రమాదకరంగా పేసర్లు

స్వింగ్‌కి అనుకూలించే సమయాల్లో పేసర్లు ప్రమాదకరంగా కనిపిస్తారు. అలాంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో బంతి పాతబడే వరకూ బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలవడం కష్టంతో కూడుకున్న పని. ఒకవేళ కోహ్లీ ఆ సమయంలో మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వెళ్లి వికెట్ చేజార్చుకుంటే భారత్ ఒత్తిడిలో పడుతుందని అని గవాస్కర్ వెల్లడించాడు.

నెం.3లో 32 సెంచరీలు సాధించిన కోహ్లీ

నెం.3లో 32 సెంచరీలు సాధించిన కోహ్లీ

వన్డేల్లో సుదీర్ఘకాలంగా మూడో స్థానంలో ఆడుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 59.50 యావరేజితో 10,533 పరుగులు చేశాడు. ఇందులో 39 సెంచరీలు ఉండగా... అందులో 32 సెంచరీలు మూడో స్థానంలో ఆడి చేసినవే కావడం విశేషం.

Story first published: Saturday, February 16, 2019, 13:43 [IST]
Other articles published on Feb 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X