న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎగిరి గంతేశాడు: చెన్నై గెలుపుతో కోహ్లీ సేన సరికొత్త టెస్టు రికార్డు

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య చెన్నైలో జరిగిన చివరి టెస్టులో కోహ్లీసేన ఇంగ్లాండ్‌పై 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 4-0 భారత్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.

By Nageshwara Rao

హైదరాబాద్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య చెన్నైలో జరిగిన చివరి టెస్టులో కోహ్లీ సేన ఇంగ్లాండ్‌పై 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 4-0 భారత్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్‌పై గతంలో లేనటువంటి అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది.

2012 టెస్టు సిరిస్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. 1999 తర్వాత వరుసగా రెండు టెస్టుల్లో ఇన్నింగ్స్ విజయాలను భారత్ కైవసం చేసుకుంది. టెస్టుల్లో భారత్‌కు ఇది వరుసగా 18 విజయం కావడం విశేషం కాగా, మరొకవైపు 2015 నుంచి వరుసగా ఐదో టెస్టు సిరీస్ విజయం.

Virat Kohli-led India set new Test record with win in Chennai

ఈ సిరీస్ విజ‌యంతో ఇంగ్లాండ్ చేతిలో 2011, 2012, 2014ల‌లో ఎదురైన ప‌రాభ‌వాల‌కు మొత్తంగా భారత్ ప్ర‌తీకారం తీర్చుకున్న‌ట్ల‌యింది. ఐదో టెస్టులో ఏడు వికెట్లు తీసుకుని భారత్ విజయంలో జడేజా కీలక పాత్ర పోషించాడు. రెండు ఇన్నింగ్స్ లు కలిపి జడేజా 10 వికెట్లు తీసుకున్నాడు.

చెన్నై టెస్టులో ప్ర‌తి ఒక్క‌రూ త‌మ వంతు పాత్ర పోషించారు. కరుణ్ నాయర్ 303 నాటౌట్, కేఎల్ రాహుల్ 199 అద్భుతమైన సెంచరీలకు తోడు మ్యాచ్ చివరిరోజున రవీంద్ర జడేజా ఏడు వికెట్లు తీసి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఐదు టెస్టుల్లో భాగంగా రాజ్ కోట్‌లో జరిగిన తొలి టెస్టు డ్రా కాగా, ఆ తర్వాత నాలుగు టెస్టుల్లో భారత్‌దే అధిపత్యం.

ముఖ్యంగా చివ‌రి రెండు టెస్టుల్లో ఏకంగా ఇన్నింగ్స్ విజ‌యాల‌తో ఇంగ్లాండ్‌ను కోలుకోలేని దెబ్బ‌తీశారు. ఈ రెండు మ్యాచుల్లోనూ ఇంగ్లాండ్ టాస్ గెలిచినా... తొలి ఇన్నింగ్స్‌లో 400, అంత‌క‌న్నా ఎక్కువ స్కోర్లు సాధించింది. అయినా ఈ రెండు మ్యాచుల్లోనూ కోహ్లిసేన ఇన్నింగ్స్ విజ‌యాలు సాధించ‌డం విశేషం.

కోహ్లీ కెప్టెన్సీలో భారత్ కొత్త రికార్డు - 18 టెస్టుల్లో విజయం (ఆగస్టు 2015 నుంచి డిసెంబర్ 2016 వరకు) - 14 టెస్టుల్లో విజయం, 4 మ్యాచ్‌లు డ్రా:

1. Beat Sri Lanka by 278 runs (August 2015) - Colombo
2. Beat Sri Lanka by 117 runs (August 2015) - Colombo
3. Beat South Africa by 108 runs (November 2015) - Mohali
4. Draw Vs South Africa (November 2015) - Bengaluru
5. Beat South Africa by 124 runs (November 2015) - Nagpur
6. Beat South Africa by 337 runs (December 2015) - New Delhi
7. Beat West Indies by an innings and 92 runs (July 2016) - North Sound
8. Draw Vs West Indies (July 2016) - Kingston
9. Beat West Indies by 237 runs (August 2016) - Gros Islet
10. Draw Vs West Indies (August 2016) - Port of Spain
11. Beat New Zealand by 197 runs (September 2016) - Kanpur
12. Beat New Zealand by 178 runs (September 2016) - Kolkata
13. Beat New Zealand by 321 runs (October 2016) - Indore
14. Draw Vs England (November 2016) - Rajkot
15. Beat England by 246 runs (November 2016) - Visakhapatnam
16. Beat England by 8 wickets (November 2016) - Mohali
17. Beat England by an innings and 36 runs (December 2016) - Mumbai
18. Beat England by an innings and 75 runs (December 2016) - Chennai India's previous best - Unbeaten in 17 Tests between September 1985 and March 1987 (Won 4, Drawn 12, Tied 1)

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X