న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ వరల్డ్ క్లాస్ ప్లేయర్, అతడు లేకున్నా పెద్ద తేడా ఉండదు: పాక్ క్రికెటర్

By Nageshwara Rao
Virat Kohli is a world class player but India capable enough without him: Fakhar Zaman

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరల్డ్ క్లాస్ ప్లేయర్ అని అతడు లేకున్నా భారత జట్టుని తక్కువ అంచనా వేయలేమని పాకిస్థాన్ క్రికెటర్ ఫకార్ జమాన్ అన్నాడు. సెప్టెంబర్ 15 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆసియా కప్ జరగనున్న సంగతి తెలిసిందే. రాబోయే సిరిస్‌లను దృష్టిలో పెట్టుకుని వర్క్‌లోడ్ కారణంగా సెలక్టర్లు విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.

శాస్త్రిని కలిసిన తర్వాతే ద్రవిడ్ ఆ పని చేశాడు: ఏం జరిగిందో తెలీదన్న గంగూలీశాస్త్రిని కలిసిన తర్వాతే ద్రవిడ్ ఆ పని చేశాడు: ఏం జరిగిందో తెలీదన్న గంగూలీ

ఈ నేపథ్యంలో ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టుపై ఫకార్ జమాన్ మాట్లాడుతూ "ప్రపంచంలోని మేటి జట్లలో భారత జట్టు ఒకటి. భారత జట్టులో కోహ్లీ ఉన్నా లేకపోయినా పెద్దగా తేడా ఉండదు అని నేను అనుకుంటున్నా. కోహ్లీ లేడని భారత జట్టును తక్కువ అంచనా వేయలేం. కోహ్లీ అగ్రశ్రేణి ఆటగాడే. కానీ, టీమిండియా కూడా గొప్ప జట్టే" అని పేర్కొన్నాడు.

చేతులెత్తేసి ఇంటికెళ్లేందుకు విమానం ఎక్కేసే రకం కాదు: ఘాటుగా బదులిచ్చిన రవిశాస్త్రిచేతులెత్తేసి ఇంటికెళ్లేందుకు విమానం ఎక్కేసే రకం కాదు: ఘాటుగా బదులిచ్చిన రవిశాస్త్రి

ఆసియా కప్‌ టోర్నీ ఆసక్తికరంగా సాగుతుంది

ఆసియా కప్‌ టోర్నీ ఆసక్తికరంగా సాగుతుంది

"కాబట్టి ఆసియా కప్‌ టోర్నీ ఆసక్తికరంగా సాగుతుందని భావిస్తున్నా. పాక్‌ తరఫున ఏ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడినా ఆటగాళ్లపై చాలా ఒత్తిడి ఉంటుంది. అదే భారత్‌-పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ అంటే ఆ ఒత్తిడి ఇంకా ఎక్కువ. ఆ అనుభవాన్ని నేను ఒకసారి ఎదుర్కొన్నా. గత కొన్నేళ్లుగా యూఏఈ వేదికగా మ్యాచ్‌లు ఆడుతున్నాం. ఇది మాకు బాగా కలిసొచ్చే అంశం" అని ఫకార్‌ జమాన్‌ అన్నాడు.

సెప్టెంబర్ 19న భారత్‌తో తలపడనున్న పాక్

సెప్టెంబర్ 19న భారత్‌తో తలపడనున్న పాక్

ఆసియా కప్‌ టోర్నీలో భాగంగా సెప్టెంబర్ 16న క్వాలిఫయర్ జట్టుతో తొలి మ్యాచ్‌ని పాకిస్థాన్ జట్టు ఆడనుంది. ఆ తర్వాత టీమిండియాతో సెప్టెంబర్ 19న భారత్‌తో పాక్ తలపడనుంది. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండటంతో టోర్నీలోనే ఈ మ్యాచ్‌ని హై ఓల్టేజ్ మ్యాచ్‌గా అభివర్ణిస్తున్నారు.

ఆసియా కప్‌లో మొత్తం ఆరు జట్లు

ఆసియా కప్‌లో మొత్తం ఆరు జట్లు

ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, ఒక క్వాలిఫయర్ జట్టు పోటీపడనున్నాయి. ఆసియా కప్ టోర్నీలో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో రోహిత్‌ శర్మ భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. మంగళవారం ఆసియా కప్‌లో పాల్గొనే పాకిస్థాన్ జట్టుని సెలక్టర్లు ప్రకటించారు. జట్టు ఎంపికలో పాక్ సెలక్టర్లు ఫిట్‌నెస్, ఫామ్‌కి పెద్దపీట వేశారు.

పాకిస్థాన్ జట్టు:

పాకిస్థాన్ జట్టు:

సర్ఫరాజ్ అహ్మద్ (కెప్టెన్), ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, షాన్ మసూద్, బాబర్ అజామ్, షోయబ్ మాలిక్, అసిఫ్ అలీ, హారీస్ సోహాలి, సదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, అష్రప్, హసన్ అలీ, మహ్మద్ అమీర్, జునైద్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, షాహీన్ షా అఫ్రిది

Story first published: Thursday, September 6, 2018, 13:25 [IST]
Other articles published on Sep 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X