న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జడ్డూ నీతో వచ్చే సమస్యే ఇది.. ఔట్ అంటావ్ రివ్యూ తీసుకున్నాక డౌట్ అంటావ్: కోహ్లీ

Virat Kohli hilariously trolls Ravindra Jadeja over DRS

న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన క్రికెటర్లంతా సోషల్ మీడియా వేదికగా కాలక్షేపం చేస్తున్న విషయం తెలిసిందే. ఇన్‌స్టా లైవ్ సెషన్స్‌తో ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్న ఆటగాళ్లు.. మధ్యలో ఫన్నీ పోస్ట్‌లు కూడా పెడుతున్నారు. ముఖ్యంగా తమ సహచర ఆటగాళ్లపై పంచ్‌లేస్తున్నారు. ఇప్పటికే భారత లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ తన చేష్టలతో సహచర ఆటగాళ్లను ఇబ్బంది పెట్టి చివాట్లు కూడా తిన్నాడు. ట్రోలింగ్‌కు కూడా గురయ్యాడు.

విరాట్ కోహ్లీ కూడా ఈ తరహా ఫన్నీ ట్వీట్లకు అదే స్థాయిలో బదులిస్తున్నాడు. తాజాగా టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. కోహ్లీని ఉద్దేశించి చేసిన ఇన్‌స్టా పోస్ట్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు.

డీఆర్ఎస్ సిగ్నల్ ఇస్తున్న కోహ్లీతో ఉన్న ఓ త్రోబ్యాక్ పిక్‌ను షేర్ చేసిన జడేజా..'భాయ్.. నేనేం రివ్యూ తీసుకోమనలేదు'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ఇక ఈ పోస్ట్ చూసిన కోహ్లీ తనదైన రీతిలో బదులిచ్చి నవ్వులు పూయించాడు. 'నీతో వచ్చే సమస్యే ఇది జడ్డూ.. ఫస్ట్ ఔట్ అంటావ్.. రివ్యూ తీసుకున్న తర్వాత డౌట్ అంటావ్'అని బదులిచ్చాడు. ఇక కోహ్లీ ఇచ్చిన ఈ సమాధానానికి అభిమానులు ఫిదా అయ్యారు. దీంతో ఈ ఇన్‌స్టా పోస్ట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ఇక డీఆర్ఎస్ విషయంలో కోహ్లీ చాలాసార్లు విఫలమయ్యాడు. ఈ సమీక్ష నిర్ణయాల్లో అతను కేవలం 8.3 శాతమే సక్సెస్ అయ్యాడు. జడేజా సూచనలతో కూడా చాలా సార్లు రివ్యూలు వృథా చేశాడు. ఇక 2017 నవంబర్ నుంచి 2019 అక్టోబర్ వరకు టెస్ట్ క్రికెట్‌లో కోహ్లీ వరుసగా 9 రివ్యూల్లో విఫలమయ్యాంటే.. అతను బౌలర్లను ఎంత గుడ్డిగా నమ్ముతాడో స్పష్టం అవుతుంది.

శరీర రంగే కాదు.. మతం కారణంగా కూడా వివక్ష: ఇర్ఫాన్ పఠాన్శరీర రంగే కాదు.. మతం కారణంగా కూడా వివక్ష: ఇర్ఫాన్ పఠాన్

Story first published: Wednesday, June 10, 2020, 18:12 [IST]
Other articles published on Jun 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X