న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒక వన్డేతో ఏడు రికార్డులు బద్దలు కొట్టిన విరాట్

India vs Westindies 2018 2nd Odi : Virat Kohli Achieves These 7 Records | Oneindia Telugu
Virat Kohli fastest to 10,000 ODI runs, breaks Sachin Tendulkars record

వైజాగ్: వెస్టిండీస్‌తో విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డుల మోత మోగించాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి (157 నాటౌట్: 129 బంతుల్లో 13ఫోర్లు, 4సిక్సులు) అజేయ సెంచరీ బాదడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. 107 బంతుల్లో వంద పరుగులు మైలురాయిని అందుకున్న కోహ్లి.. ఈ క్రమంలో దాదాపు ఏడు రికార్డుల్ని బద్దలుకొట్టాడు.

వేగవంతమైన 10వేల పరుగులు: కింగ్ కోహ్లీకి సెల్యూట్.. !!వేగవంతమైన 10వేల పరుగులు: కింగ్ కోహ్లీకి సెల్యూట్.. !!

అగ్రస్థానాన్ని అధిరోహించిన కోహ్లీ:

అగ్రస్థానాన్ని అధిరోహించిన కోహ్లీ:

వెస్టిండీస్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా జాబితాలో ఇప్పటి వరకు 1,573 పరుగులతో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. బుధవారం 1,574 రన్స్‌తో ఆ రికార్డుని కోహ్లి బద్దలుకొట్టాడు. కోహ్లి, సచిన్ తర్వాత.. వెస్టిండీస్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లుగా రాహుల్ ద్రవిడ్ (1348), సౌరవ్ గంగూలీ (1142) టాప్-4లో కొనసాగుతున్నారు.

సచిన్ 259.. కోహ్లి 205 ఇన్నింగ్స్‌ల్లోనే

సచిన్ 259.. కోహ్లి 205 ఇన్నింగ్స్‌ల్లోనే

సచిన్ టెండూల్కర్ 259 ఇన్నింగ్స్‌లో ఈ 10వేల పరుగుల మార్క్‌ని అందుకోగా.. విరాట్ కోహ్లి కేవలం 205 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం. ఇంతకుముందు భారత ఇన్నింగ్స్‌లో కోహ్లి వీరవిహారమే హైలైట్‌. అతను నాలుగో ఓవర్లోనే క్రీజులోకి వచ్చాడు. రోచ్‌ బౌలింగ్‌లో ఓపెనర్‌ రోహిత్‌శర్మ (4) వెనుదిరగడంతో కోహ్లి బ్యాటింగ్‌కు వచ్చాడు. ధావన్‌ (29; 30 బంతుల్లో 4ఫోర్లు, ఒక సిక్సు) కాసేపు మెరుపులు మెరిపించి ఔటయ్యాడు.

రాయుడు ఔటయ్యాక.. ఆటంతా కోహ్లిదే

రాయుడు ఔటయ్యాక.. ఆటంతా కోహ్లిదే

40 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయిన టీమిండియాకు కోహ్లి, రాయుడు అండగా నిలిచారు. అనవసర షాట్లకు పోకుండా సింగిల్స్‌, డబుల్స్‌తో ఇన్నింగ్స్‌ను నిర్మించారు. హోల్డర్‌ క్యాచ్‌ వదిలేయడంతో 44 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడిన కోహ్లి తర్వాత వెనుదిరిగి చూడలేదు. కోహ్లితో 139 పరుగులు జోడించాక రాయుడు.. ఔటయ్యాడు. ఆ తర్వాత ఆటంతా కోహ్లిదే. నర్స్‌ వేసిన 37వ ఓవర్లో లాంగాన్‌ మీదుగా సింగిల్‌తో 10 వేల పరుగులు మైలురాయిని దాటాడు.

మైలురాయిని చేరుకున్నందుకు గర్వంగా

మైలురాయిని చేరుకున్నందుకు గర్వంగా

44వ ఓవర్లో సెంచరీ పూర్తి చేసిన విరాట్‌.. అక్కడ్నుంచి గేరు మార్చాడు. చివరి 5 ఓవర్లలో 61 పరుగులు రాగా.. కోహ్లికి మూడో హాఫ్ సెంచరీని 21 బంతుల్లోనే పూర్తి చేయగలిగాడు. ‘వ్యక్తిగతంగా నా ఇన్నింగ్స్‌ పట్ల, వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని చేరుకున్నందుకు గర్వంగా ఉన్నా. మ్యాచ్‌ గొప్పగా సాగింది. విండీస్‌ చాలా బాగా ఆడింది. అదృష్టవశాత్తు మ్యాచ్‌ను టై చేసుకోగలిగాం. అంబటి రాయుడు చాలా బాగా ఆడాడు'

కోహ్లీ పేరిట నమోదైన రికార్డులు

కోహ్లీ పేరిట నమోదైన రికార్డులు

1. వేగంగా 10వేల పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాట్స్‌మెన్ (సచిన్ రికార్డ్ బ్రేక్)

2. భారత్‌లో వేగంగా 4వేల పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్

3. వెస్టిండీస్‌పై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్

4. ఏడాదిలో తక్కువ ఇన్నింగ్స్‌లోనే 1000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్

5. ఎక్కువ బ్యాటింగ్ సగటుతో 10వేల పరుగులు అందుకున్న బ్యాట్స్‌మెన్ (ధోని రికార్డ్ బ్రేక్)

6. వెస్టిండీస్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్ (సచిన్ రికార్డ్ బ్రేక్)

7. ఎక్కువ బ్యాటింగ్ సగటుతో 4వేల పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాట్స్‌మెన్ (ధోని రికార్డ్ బ్రేక్)

1
44267
Story first published: Thursday, October 25, 2018, 10:07 [IST]
Other articles published on Oct 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X