న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్రాండ్‌ విలువ రూ.1200 కోట్లు: కోహ్లీనే టాప్‌, 12వ స్థానంలో ధోని

Virat Kohli beats Deepika Padukone as most valued Indian celebrity, MS Dhoni placed 12th

హైదరాబాద్: దేశంలో అత్యధిక బ్రాండ్‌ విలువ కలిగిన సెలబ్రిటీల జాబితాలో వరుసగా రెండో ఏడాది విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. గతేడాదితో పోలిస్తే 2018లో కోహ్లీ బ్రాండ్ విలువ 18 శాతం పెరిగి 170.8 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.1200 కోట్లు) చేరింది. డఫ్‌ అండ్‌ ఫెల్ప్స్‌ అనే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం..

కోహ్లీ ఖాతాలో 24 బ్రాండ్లు

కోహ్లీ ఖాతాలో 24 బ్రాండ్లు

గతేడాది నవంబరు వరకు కోహ్లీ ఖాతాలో 24 బ్రాండ్లు ఉన్నాయి. వివిధ వాణిజ్య సంస్థలకు చేస్తున్న ప్రచారాన్ని లెక్కలోకి తీసుకుంటూ ప్రముఖ గ్లోబల్‌ వాల్యుయేషన్, కార్పొరేట్‌ ఫైనాన్స్‌ సలహాదారు సంస్థ ‘డఫ్‌ అండ్‌ ఫెల్ఫస్‌' తాజా నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం 18 శాతం పెరుగుదలతో కోహ్లీ తన స్థాన్ని మరింత పదిలం చేసుకున్నాడు.

దీపికా ఖాతాలో 21 బ్రాండ్లు

దీపికా ఖాతాలో 21 బ్రాండ్లు

ఇక, 21 బ్రాండ్లు కలిగిన బాలీవుడ్‌ నటి దీపికా పడుకోన్‌ రూ.722 కోట్ల (102.5 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు) బ్రాండ్‌ విలువతో రెండో స్థానం దక్కించుకుంది. బ్రాండ్ల ద్వారా వచ్చే సంపాదన 100 మిలియన్ డాలర్లకు పైగా ఉన్నది వీరిద్దరికే కావడం విశేషం. బాలీవుడ్‌ హీరోలు అక్షయ్‌ కుమార్‌ (రూ.473 కోట్లు), రణ్‌వీర్‌ సింగ్‌ (రూ.443 కోట్లు) మూడు, నాలుగో స్థానాల్లో నిలిచారు.

ఐదో స్థానానికి పడిపోయిన షారుక్

ఐదో స్థానానికి పడిపోయిన షారుక్

ఈ జాబితాలో ఉన్న మొత్తం 20 సెలబ్రిటీ బ్రాండ్ల విలువ 877 మిలియన్ డాలర్లు (సుమారు రూ.6180 కోట్లు). ఈ మొత్తంలో టాప్ 10 సెలబ్రిటీల వాటా 75 శాతానికి పైగా ఉంది. మరోవైపు గతేడాది రెండో స్థానంలో ఉన్న షారుక్ ఖాన్‌ (రూ.427 కోట్లు) ఐదో స్థానానికి పడిపోయాడు. అతని బ్రాండ్ విలువ 60.7 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.427 కోట్లు) పడిపోయింది.

జాబితాలో ఎక్కువ మంది బాలీవుడ్ నటులే

జాబితాలో ఎక్కువ మంది బాలీవుడ్ నటులే

ధోనీ (రూ.189 కోట్లు) 12వ స్థానంలో, బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు (రూ.152 కోట్లు) 15వ స్థానంలో ఉన్నారు. కాగా, మొత్తం 20 సెలబ్రిటీలతో కూడిన ఈ జాబితాలో బాలీవుడ్ నటులే ఉండటం విశేషం. కోహ్లీ, సచిన్, ధోనీ, పీవీ సింధు కలిసి దాదాపు 241 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1698 కోట్లు) అందించారు.

Story first published: Friday, January 11, 2019, 13:08 [IST]
Other articles published on Jan 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X