న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC ODI Rankings: టాప్ లేపిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా

ICC ODI Rankings : Virat Kohli,Rohit Sharma & Jasprit Bumrah Maintain Their Top Spots ! || Oneindia
Virat Kohli and Rohit Sharma consolidate their top positions in latest ICC ODI Rankings

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు వన్డేల సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో తమ స్థానాలను మరింత పదిలం చేసుకున్నారు. ఆదివారంతో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే సిరిస్ ముగియడంతో ఐసీసీ సోమవారం వన్డే ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది.

ఈ ర్యాంకింగ్స్‌లో రెండు రేటింగ్ పాయింట్లు అదనంగా జత చేరడంతో మొత్తంగా విరాట్ కోహ్లీ(886) రేటింగ్ పాయింట్లతో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఇక, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ(868) రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ ఖాతాలో అదనంగా మూడు రేటింగ్ పాయింట్లు వచ్చి చేరాయి.

Under-19 World Cup: 175kph డెలివరీతో భారత్‌పై ప్రపంచ రికార్డు సృష్టించిన 17 ఏళ్ల యువ పేసర్Under-19 World Cup: 175kph డెలివరీతో భారత్‌పై ప్రపంచ రికార్డు సృష్టించిన 17 ఏళ్ల యువ పేసర్

మూడు వన్డేల సిరిస్‌లో విరాట్ కోహ్లీ మొత్తంగా 183 పరుగులతో మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డుని కైవసం చేసుకోగా... మూడో వన్డేలో సెంచరీ సాధించడంతో రోహిత్ శర్మ 171 పరుగులతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. 829 రేటింగ్ పాయింట్లతో పాకిస్థాన్ ఆటగాడు బాబర్ అజామ్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఈ సిరిస్‌లో 170 పరుగులు చేసిన ఓపెనర్ శిఖర్ ధావన్ ఏడు స్థానాలు ఎగబాకి 15వ స్థానంలో నిలిచాడు. ఇక, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ 21 స్థానాలు ఎగబాకి 50వ స్థానంలో నిలిచాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రెండు స్థానాలు ఎగబాకి 27వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

నేను ఆడిన టీమిండియా కాదు.. ఆసిస్‌ను చిత్తు చేసిన భారత్‌పై పాక్ క్రికెటర్ ప్రశంసలు..నేను ఆడిన టీమిండియా కాదు.. ఆసిస్‌ను చిత్తు చేసిన భారత్‌పై పాక్ క్రికెటర్ ప్రశంసలు..

ఇక, ఆస్ట్రేలియా జట్టు విషయానికి వస్తే స్టీవ్ స్మిత్ 229 పరుగులతో టాస్ స్కోరర్‌గా నిలిచాడు. మూడో వన్డేలో 131 పరుగులతో మూడేళ్ల విరామం తర్వాత వన్డేల్లో సెంచరీని సాధించాడు. ఫలితంగా నాలుగు స్థానాలు ఎగబాకి 23వ స్థానంలో నిలిచాడు. తొలి వన్డేలో సెంచరీ సాధించిన డేవిడ్ వార్నర్ ఒక స్థానం ఎగబాకి ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

బౌలింగ్‌ విభాగంలో జస్ప్రీత్‌ బుమ్రా (764) పాయింట్లతో తొలి స్థానాన్ని కాపాడుకున్నాడు. కివీస్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ (737) పాయింట్లు సాధించి రెండో స్థానంలో కైవసం చేసుకోగా అఫ్గానిస్థాన్‌ బౌలర్‌ ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌ (701) పాయింట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఆసీస్‌ పేసర్‌ పాట్‌ కమిన్స్‌ (673) పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు.

ఐసీసీ వన్డే ర్యాంకులను ఈ క్రింద వీక్షించండి:

టీమ్ ర్యాంకింగ్స్ | బ్యాటింగ్ ర్యాంకింగ్స్ | బౌలర్ ర్యాంకింగ్స్ | ఆల్ రౌండర్స్ ర్యాంకింగ్స్

Story first published: Monday, January 20, 2020, 17:37 [IST]
Other articles published on Jan 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X