న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బుమ్రా బౌలింగ్ యాక్షన్‌ను అనుకరించబోయి బోర్లాపడ్డాడు (వీడియో)

VIRAL VIDEO! Jasprit Bumrah clean bowled by Aussie kid imitating his action after success Down Under

హైదరాబాద్: ఆసీస్ గడ్డపై టీమిండియా చారిత్రక టెస్టు విజయాన్ని సొంతం చేసుకోవడంలో ప్రధాన పాత్ర పోషించిన మాత్రం మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఛటేశ్వర్ పుజారానే. అయితే, బుమ్రా కూడా పుజారా అంతకాకపోయినా... బంతిలో రాణించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా జట్టు స్పిన్నర్ నాథన్ లియాన్‌తో సమానంగా 21 వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.

నా కళ్లు చెమర్చాయి: కోహ్లీసేనకు ట్రోఫీ బహుకరణపై సునీల్ గవాస్కర్నా కళ్లు చెమర్చాయి: కోహ్లీసేనకు ట్రోఫీ బహుకరణపై సునీల్ గవాస్కర్

ముఖ్యంగా మెల్‌బోర్న్ టెస్టులో బుమ్రా అద్భుత ప్రదర్శనకు ఆస్ట్రేలియా అభిమానులు సైతం ఫిదా అయ్యారు. తన లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పట్టించాడు. పేసర్లలో బుమ్రా బౌలింగ్‌ శైలి భిన్నంగా ఉంటుంది. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న బుమ్రా యార్కర్లు వేయడంలో దిట్ట.

అలాంటి బుమ్రా బౌలింగ్‌ను ఆస్ట్రేలియాకు చెందిన ఓ చిన్నారి స్ఫూర్తిగా తీసుకున్నాడు. అచ్చం బుమ్రాలాగే బౌలింగ్‌ వేసి ఆకట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఆస్ట్రేలియాకు చెందిన ఓ నెటిజన్‌ ట్విటర్‌లో పంచుకుంటూ బుమ్రా, కామెంటేటర్‌ హర్షా భోగ్లేకు ట్యాగ్ చేశాడు.

"ఈ కిడ్‌ చాలా క్యూట్‌గా ఉన్నాడు. అతనికి నా అభినందనలు తెలపండి" అని బుమ్రా ట్వీట్‌ చేయగా, 'అద్భుతం' అంటూ హర్షా భోగ్లే సైతం ట్వీట్ చేశాడు. దీంతో పాటు ఐసీసీ కూడా ఫన్నీ ట్వీట్ చేసింది. "2034లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగబోయే సిరీస్‌ రసవత్తరంగా సాగుతుందేమో!" అంటూ ట్వీట్ చేసింది.

ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. "ఇప్పటి ఆసీస్‌ బౌలర్లు ఈ చిన్నారిని స్ఫూర్తిగా తీసుకోవాలి" అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా... "స్టంప్స్‌ అంత ఎత్తుకూడా లేడు. కానీ బుమ్రాను అనుకరిస్తున్నాడు" అని మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు.

Story first published: Wednesday, January 9, 2019, 15:51 [IST]
Other articles published on Jan 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X