న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పరుగులో అలసిపోయి ఇక చాలు అంటూ కోహ్లీకి పుజారా సైగలు (వీడియో)

VIRAL VIDEO: Cheteshwar Pujara refuses for a 4th run as Virat Kohli makes him sprint on day 2 of MCG Test

హైదరాబాద్: మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 215/2తో భారత్ తొలి ఇన్నింగ్స్‌‌ని కొనసాగించిన చతేశ్వర్ పుజారా (106), కోహ్లీ (82) తొలి సెషన్‌లోనూ దూకుడుగా ఆడారు.

రోహిత్‌ను టీజ్ చేసిన పైన్: నెటిజన్లు ఏమని ట్రోల్ చేశారంటే!రోహిత్‌ను టీజ్ చేసిన పైన్: నెటిజన్లు ఏమని ట్రోల్ చేశారంటే!

మూడో వికెట్‌కి 170 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీ బౌండరీల కంటే వికెట్ల మధ్య సింగిల్స్, డబుల్స్‌కే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. అయితే, వికెట్ల మధ్య కోహ్లీతో పోటీపడుతూ పుజారా పరుగులు తీయలేకపోవడం విశేషం. ఒకానొక దశలో పుజారా ఇక చాలు అంటూ సైగలు చేయడం కూడా కనిపించింది.

1
43625
 మూడు పరుగులు తీసిన కోహ్లీ-పుజారా

మూడు పరుగులు తీసిన కోహ్లీ-పుజారా

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇన్నింగ్స్‌ 120వ ఓవర్ వేసిన ఫాస్ట్ బౌలర్ కమిన్స్ బౌలింగ్‌లో బంతిని మిడ్‌ వికెట్‌గా దిశగా కోహ్లీ బాదాడు. బంతి బౌండరీ వద్దకు వెళ్లే లోపు వికెట్ల మధ్య పుజారా-కోహ్లీలు మూడు పరుగులు తీశారు. నాలుగో పరుగు కోసం కోహ్లీ, పుజారాని పిలిచాడు.

ఇక చాలు అంటూ పుజారా సైగలు

అప్పటికే అలసిపోయిన పుజారా క్రీజులోకి వెళ్లగానే నవ్వుతూ ఇక చాలు అంటూ సైగలు చేశాడు. వాస్తవానికి నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌‌కి వేగంగా సింగిల్, డబుల్‌ని పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అయితే, ఇక్కడ స్ట్రైకింగ్‌లో ఉన్న కోహ్లీ అందుకు భిన్నంగా మూడు పరుగులు సాధించాడు. కోహ్లీ ఫిట్‌గా ఉన్నాడు అనడానికి ఈ వీడియోనే నిదర్శనం.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 8/0

ఇదిలా ఉంటే, బాక్సింగ్ డే టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య ఆస్ట్రేలియా 8/0 స్థితిలో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో మార్కస్ హారిస్(5), ఆరోన్ ఫించ్(3) పరుగులతో ఉన్నారు. అంతకముందు టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ని 443/7 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా వికెట్లేమీ కోల్పోకుండా 5 పరుగులతో నిలిచింది.

ఆస్ట్రేలియాపై నాలుగో సెంచరీ చేసిన పుజారా

భారత ఇన్నింగ్స్‌లో ఛటేశ్వర్ పుజారా అత్య‌ధికంగా 106 పరుగులు చేయగా.... కెప్టెన్ కోహ్లీ(82) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక, గాయం కారణంగా రెండో టెస్టుకు దూరైమన రోహిత్ శర్మ(63 నాటౌట్: 114 బంతుల్లో 5 ఫోర్లు) ఈ టెస్టులో మాత్రం అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఆసీస్ బౌల‌ర్లలో క‌మ్మిన్స్ మూడు, స్టార్క్ రెండు వికెట్లు, హేజిల్‌వుడ్‌, నాథన్‌ లియాన్‌ చెరో వికెట్ తీశారు.

Story first published: Thursday, December 27, 2018, 16:22 [IST]
Other articles published on Dec 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X