న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అండర్ 19 కోచ్ ద్రవిడ్.. గంగూలీకి ఫోన్ చేసి మరీ..

Vijay Hazare Trophy: India U-19 World Cup-winning pacer Ishan Porel to be out of action with injury

హైదరాబాద్: అండర్ 19 కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ వంద శాతం సక్సెస్ అయ్యారు. ఈ విషయాన్ని భారత్‌కు ప్రపంచ కప్ సొంతం కావడంతో అందరికీ తెలిసింది. కానీ, ఆయనెంత జాగ్రత్త తీసుకున్నారో జట్టు సభ్యులు ఇలా తెలిపారు. బెంగాల్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకి టీమిండియా అండర్‌-19 కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఫోన్‌ చేశారు. ప్రపంచకప్‌ సెమీస్‌, ఫైనల్లో అద్భుత బౌలింగ్‌తో చెలరేగిన బెంగాల్‌ కుర్రాడు ఇషాన్‌ పోరెల్‌ గాయం గురించి తెలియజేశాడట. ఈ విషయాన్ని స్వయంగా పోరెల్‌ మీడియాకు వెల్లడించాడు.

ప్రపంచకప్‌ విజయం తర్వాత భారత్‌కు వచ్చిన ఇషాన్‌ పోరెల్‌ మంగళవారం కోల్‌కతా చేరుకున్నాడు. బెంగాల్‌ క్రికెట్‌ సంఘం సభ్యులు అతడికి ఘనంగా స్వాగతం పలికారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా ఫోన్‌ చేసి పోరెల్‌కు అభినందనలు తెలియజేశారు. కోల్‌కతాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న చందన్‌నగర్‌లోని పోరెల్‌ ఇంటికి అభినందనల పత్రాలు పంపించారు. ఈ సందర్భంగా అతడు మీడియాతో మాట్లాడాడు.

'ప్రపంచ కప్‌ గెలిచిన ప్రాధాన్యత నాకు తెలుసు. నేనిప్పుడు నేర్చుకొనే దశలో ఉన్నాను. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించాలన్న అవగాహన ఉంది. అప్పుడే నేను సీనియర్‌ జట్టుకు ఎంపికవుతా. ఒక పద్ధతి ప్రకారమే అక్కడి చేరుకుంటా. గాయపడ్డ నాకు జట్టులో అందరూ మద్దతుగా నిలిచారు. నేను ఆడగలనని ఉత్సాహపరిచారు. జట్టుకు, రాహుల్‌ సర్‌, అభయ్‌ సర్‌, పరాస్‌ సర్‌కు నేను కృతజ్ఞుడిగా ఉంటాను. వారంతా నేను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నారు. టెస్టుల నుంచి టీ20 వరకు అన్ని ఫార్మాట్లలో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని నా కోరిక' అని పోరెల్‌ అన్నాడు. గాయం కారణంగా పోరెల్‌ బంగాల్‌ తరఫున విజయ్ హజారే ట్రోఫీలో అందుబాటులో లేడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, February 7, 2018, 10:13 [IST]
Other articles published on Feb 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X