న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే బుమ్రా బౌలింగ్‌ను ఆడలేకపోతున్నారు: మాజీ పేసర్

Venkatesh Prasad says why India pacer Jasprit Bumrah is much more successful
Bumrah Unorthodox Action Confuses Batsmen, Lasith Malinga || Oneindia Telugu

ముంబై: విభిన్నమైన బౌలింగ్ శైలి కారణంగానే జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను బ్యాట్స్‌మెన్ అర్థం చేసుకోలేక ఆడలేకపోతున్నారని టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ అన్నాడు. అతనిలానే విచిత్రమైన యాక్షన్ కలిగిన లసిత్ మలింగా బౌలింగ్‌‌ను ఆడేందుకు ఇబ్బంది పడతారని తెలిపాడు. ప్రస్తుత క్రికెట్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయన్నాడు. ఆఫ్‌ కట్టర్లు, ఆఫ్‌ కట్టర్‌ బౌన్సర్‌, నకుల్‌ బాల్‌, బ్యాక్‌ ఆఫ్ ది హ్యాండ్‌, వైవిధ్యమైన యార్కర్లు కొత్తగా పుట్టుకొచ్చాయని పేర్కొన్నాడు.

టీమిండియా యార్కర్ల కింగ్ జస్ప్రీత్‌ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తున్నాడో అందరికీ తెలిసిందే. అరంగేట్రం చేసినప్పటి నుంచి అతని బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు బ్యాట్స్‌మెన్‌ జంకుతున్నారు. విచిత్రమైన శైలి కావడం.. రన్నప్‌ తక్కువగా ఉండటం.. యాంగిల్‌ భిన్నంగా ఉండటంతో ఎలాంటి బంతులు వేస్తాడో అర్థమవ్వదు. ఇక అతడి యార్కర్లు అత్యంత కచ్చితత్వంతో ఉంటాయి. సైడ్‌ఆర్మ్‌ బౌలింగ్‌తో లసిత్‌ మలింగ అద్భుతాలెన్నో చేయడం మనం చూశాం. ఇదే విషయాన్ని వెంకటేశ్ ప్రసాద్ చెప్పుకొచ్చాడు.

'బుమ్రా పూర్తిగా భిన్నమైన బౌలర్‌. ఎందుకంటే అతని బౌలింగ్‌ శైలి సంప్రదాయానికి భిన్నంగా ఉంటుంది. అతను లసిత్‌ మలింగ తరహా బౌలర్‌. బుమ్రా ఒకవైపు నుంచే బౌలింగ్‌ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అలాంటి బౌలర్లను ఆడటం సులువు కాదు. వాళ్ల బంతులు నేరుగా పిచ్‌ అవుతాయా? స్వింగ్‌ చేస్తారా? అర్థంకాక బ్యాట్స్‌మన్‌ తికమక పడతారు. అందుకే వారు సక్సెస్ సాధించారు. బుమ్రా భిన్నమైన శైలే అతడికెంతో ఉపయోగపడుతోంది. అందులో చాలా వైవిధ్యం ఉంటుంది' అని వెంకటేశ్‌ ప్రసాద్‌ అన్నాడు.

Story first published: Wednesday, June 2, 2021, 21:13 [IST]
Other articles published on Jun 2, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X